షాకింగ్ : నిద్రమాత్రలు మింగేసిన ఇలియానా..!

అతితక్కువ సమయంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఇలియానా. ‘దేవదాసు’ ‘పోకిరి’ ‘జల్సా’ జులాయి’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన ఈ బ్యూటీ కెరీర్ పీక్స్ లో ఉండగానే బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ పర్వాలేదు అనేలా అవకాశాలు అయితే దక్కించుకుంది కానీ స్టార్ హీరోయిన్ గా అయితే ఎదగలేకపోయింది. అది సరిపోదు అన్నట్టు ప్రేమలో పడి కెరీర్ ను మరింత నిర్లక్ష్యం చేసింది. ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రంతో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఆమెను ఎవ్వరూ పట్టించుకోకపోగా బాగా లావుగా ఉంది అనే ట్రోల్స్ కూడా ఎదుర్కొంది.

ఇదిలా ఉంటే తన లవర్ తో బ్రేకప్ అయ్యాక ఈమె బాగా డిప్రెషన్ కు వెళ్లిపోయిందట. ఈ విషయాన్ని ఆమె సన్నిహితులే చెబుతుండడం విశేషం. ‘డిప్రెషన్ కారణంగా తరచుగా నిద్రమాత్రలు తీసుకునేదట. దీంతో శరీరం పై నియంత్రణ కోల్పోయి లావైపోయిందని వారు చెప్పుకొస్తున్నారు. అదే సమయంలో ఇలియానా ఆత్మహత్య చేసుకోవాలని కూడా ప్రయత్నించిందట. ఆ క్రమంలో ఆమెను సైకియాట్రిస్ట్ వద్దకు కూడా తీసుకెళ్ళారట ఆమె సన్నిహితులు. ఆమె కోలుకుని… తిరిగి కెరీర్ లో ఎలాగైనా రాణించాలని నిర్ణయించుకుని ఇప్పుడు ఫిజిక్ పై దృష్టి పెట్టిందని వారు చెబుతున్నారు. ఈమె ఇప్పుడు బాగా స్లిమ్ అయ్యిందని కూడా వారు చెబుతున్నారు.

“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్! 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus