గురువు ప్రోత్సాహం మరువలేనిదంటున్న సుకుమార్..!

  • February 1, 2019 / 11:00 AM IST

‘రంగస్థలం’ చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు సుకుమార్. ఈ చిత్రానికి ముందు… ఎక్కువ ఈక్వేషన్లు… లాజిక్ లు చూపించి జనాలను కన్ఫ్యూజ్ చేస్తాడనే విమర్శలు ఎదుర్కొన్నాడు సుకుమార్. అయితే ఒక్కసారి… మాస్ కి ఎంటరైతే ఎలా ఉంటుందనేది…’రంగస్థలం’ చిత్రంతో నిరూపించాడు. ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ తో ఓ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు. మార్చి నుండీ ఈ చిత్రం మొదలు కాబోతుందని తెల్సుతుంది. ఇదిలా ఉండగా… తాజాగా సుకుమార్ తన సొంతూరు కి వెళ్ళాడు.

జనవరి 31 న (గురువారం) కామవరపు కోట అనే గ్రామంలో ‘కామవరపుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాల’ ప్రిన్సిపాల్‌ కె.వి.రమణ మూర్తి పదవీ విరమణ కార్యక్రమానికి హాజరయ్యాడు సుకుమార్. ఈ కార్యక్రమంలో సుకుమార్ మాట్లాడుతూ… “విద్య నేర్పిన గురువు రమణమూర్తి ప్రోత్సాహంతోనే సినీ రంగంలో మంచి అవకాశాలను అందిపుచ్చుకోగలిగాను. రాజోలు కళాశాలలో రమణమూర్తి గారు నాకు విద్య నేర్పించారు. గురువుగా ఆయన అందించిన ప్రోత్సాహం వలనే సినీ రంగం లో రాణించగల్గుతున్నాను. సాహిత్య రంగం వైపు నన్ను నడిపించిన గురువు రమణమూర్తిగారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను” అంటూ పేర్కొన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus