ఆ ఫోటోలు అవకాశాల కోసం కాదు

  • February 15, 2018 / 01:30 PM IST

సాధారణంగా పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒక హీరోయిన్ కాస్త శృతి మించి ఓవర్ ఎక్స్ ఫోజ్ చేస్తూ ఫోటోలకు ఫోజులివ్వడమో లేక సినిమాల్లో అందాల ప్రదర్శన డోస్ పెంచింది అంటే.. అమ్మడు కాస్త ఓవర్ చేస్తుంది అంటారు. అదే హీరోయిన్ కి ఆఫర్లు లేక కాస్త ఇబ్బందిపడుతున్న తరుణంలో గనుక హీరోయిన్ సదరు హాట్ ఫోటోస్ రిలీజ్ చేస్తే.. “ఆఫర్ల కోసం అమ్మాయి బరితెగించేసింది” అంటారు. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ పరిస్థితి అలాగే తయారయ్యింది. పాపం తెలుగులో సరైన అవకాశాలు లేక తమిళ మరియు హిందీ సినిమాలు చేసుకుంటూ కెరీర్ నెట్టుకొస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల పాపులర్ మ్యాగజైన్ “మాగ్జిమ్” కోసం ఒక హాట్ ఫోటోషూట్ చేయించుకొంది.

ఆ ఫోటోలు ఆన్ లైన్ లో ప్రత్యక్షమైనప్పట్నుంచి అందరూ రకుల్ గురించి అందరూ కాస్త బ్యాడ్ గా మాట్లాడడం మొదలెట్టారు. ఆఫర్ల కోసం బరితెగించేసిందని, అవకాశాల కోసం ఆరాటపడుతోందని రకరకాల కథనాలు వెలువడ్డాయి. అయితే.. ఈ కథనాలపై రకుల్ స్పందించింది. ప్రస్తుతం నా చేతిలో రెండు హిందీ సినిమాలతోపాటు రెండు తమిళ చిత్రాలు కూడా ఉన్నాయి. తెలుగులో కూడా కొన్ని ఆఫర్లు ప్రస్తుతం పైప్ లైన్ లో ఉన్నాయి. అందువల్ల నాకు అవకాశాల కోసం ఇలా హాట్ ఫోటోషూట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus