Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • అభిజీత్ శ్రీనాథ్ (Hero)
  • యష్నా ముత్తులూరి (Heroine)
  • వారాహి మల్లిపాముల, సాయి కృష్ణ, కిరీటి దామరాజు, వైష్ణవి వర్మ తదితరులు తదితరులు (Cast)
  • నిశాంతి ఏవని (Director)
  • వారాహి మల్లిపాముల, శ్రీదేవి మల్లిపాముల (Producer)
  • నిర్వాణ్ ఆత్రేయ, రాజా కుమారి, కరణ్ పాండవ్ (Music)
  • జ్ఞానశేఖర్ వి.ఎస్ (Cinematography)
  • అశుతోష్ మతేలా, రామకృష్ణ ఆరమ్ (Editor)
  • Release Date : 2nd అక్టోబ‌ర్‌ 2026
  • వారాహి (Banner)

ఈ వారం పదుల సంఖ్యలో రిలీజ్ అయిన సినిమాల్లో ‘ఇంప్యూర్’ అనే చిన్న సినిమా కూడా ఉంది. ఇదొక ఇండిపెండెంట్ మూవీ. ‘మా ఇంటి బంగారం’ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో పని చేసిన నిశాంతి ఎవాని ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అయ్యారు. అందుకే నందినీ రెడ్డి ఈ సినిమా ప్రమోషన్స్ కి హాజరయ్యి.. తన వంతు పుష్ ఇచ్చారు. మరి సినిమా ఎంత వరకు ప్రేక్షకులను అలరించిందో తెలుసుకుందాం రండి:

Impure Movie Review

కథ: సంధ్య (యష్నా ముత్తులూరి) ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి. పెళ్లీడుకు వచ్చిన అమ్మాయిలకు త్వరగా పెళ్లి చేయాలని మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఆశపడుతుంటారు. సంధ్య పేరెంట్స్ కూడా అదే పద్ధతిలో ఆలోచించి సంధ్యకు పెళ్లి సంబంధం కుదురుస్తారు. అయితే పెళ్లి సమయానికి ‘సంధ్య గతంలో రిలేషన్ షిప్‌లో ఉందని, ఆమె వర్జిన్ కాదని’ మగపెళ్లివారి ఫ్యామిలీకి తెలుస్తుంది.

ఇదే కారణం సంధ్య ఫ్యామిలీకి చెప్పి వాళ్లు పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటారు. దీంతో సంధ్య తన పేరెంట్స్‌ను ఫేస్ చేయలేక ఇబ్బంది పడుతుంది. మరోవైపు ఇదే విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంధ్య కజిన్‌ వీరా (వారాహి) తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ రీల్ చేసి పెడుతుంది. ‘పెళ్లికొడుకుకు లేని వర్జినిటీ… పెళ్లికూతురు సంధ్యకు ఎందుకు?’ అంటూ ఆమె ఆ వీడియోలో అగ్రెసివ్ కామెంట్స్ చేస్తుంది. తక్కువ టైమ్‌లోనే ఆ వీడియో తెగ వైరల్ అయిపోతుంది. ఈ నేపథ్యంలో సొసైటీ మొత్తం సంధ్యను దోషిలా చూస్తుంది. ఆమె జాబ్ లైఫ్‌లో కూడా సమస్యలు, వేధింపులు ఎదురవుతాయి.

ఈ అవమానాలతో సంధ్య ఉద్యోగం మానేస్తుంది. ఆ తర్వాత సంధ్య జీవితం ఏమైంది? మరోవైపు మొగుడు “గే” అని తెలిసి వదిలేసిన వీరా లైఫ్ ఏమైంది? హీరో అయి సినిమా ఫీల్డ్‌లో రాణించాలనుకున్న సంధ్య, వీరా..ల స్నేహితుడు ప్రణవ్ (సాయి కృష్ణ) తన లక్ష్యాన్ని ఛేదించాడా? మధ్యలో నిష్ (అభిజీత్ శ్రీనాథ్) ఎవరు? అతను సంధ్య జీవితంలోకి వచ్చాక ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి? అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు: యష్నా మోడ్రన్ అమాయకురాలి అమ్మాయిగా బాగా సెట్ అయ్యింది. ఆమె నేచురల్ పెర్ఫార్మెన్స్, బ్యూటీఫుల్ లుక్స్ కూడా ఆకట్టుకుంటాయి. అయితే ఆమె కంటే వీరా పాత్రలో వారాహి ఇంకా బాగా నటించింది. తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో వీరా పాత్రకి ఆడియన్ ఎక్కువగా కనెక్ట్ అవుతాడు. సినీ పరిశ్రమలో హీరో అవ్వడానికి కష్టపడే యువకుడిగా సాయికృష్ణ లైఫ్ రియల్ లైఫ్ లో చాలా మందిని రిప్రజెంట్ చేయొచ్చు. నిష్ పాత్రలో చేసిన అభిజిత్‌ శ్రీనాథ్‌ చూడటానికి అందంగా ఉన్నాడు. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో పర్వాలేదు అనిపించాడు. కిరీటి దామరాజు పాత్ర సీరియస్ గానే కనిపిస్తూ నవ్వులు పూయిస్తుంది. ఆర్జే కాజల్‌, శ్రీవాణి పర్వాలేదు అనేలా పెర్ఫార్మ్ చేశారు. మిగతా నటీనటులు కూడా ఓకే.

సాంకేతిక నిపుణుల పనితీరు: ఈ విభాగంలో ఎక్కువ న్యాయం చేసినవారు కెమెరామెన్ జ్ఞానశేఖర్ వి.ఎస్. క్యారెక్టర్స్, సిట్యుయేషన్స్, ఎమోషన్స్‌ను కరెక్ట్‌గా క్యాప్చర్ చేసి ప్రెజెంట్ చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వీరా క్లాసికల్ డాన్స్ చేసిన సన్నివేశంలో ఆమెలో రియలైజేషన్ వచ్చినట్టు చాలా బాగా చూపించారు. ఈ సీన్ చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇలాంటి సినిమాకి మంచి మ్యూజిక్ చాలా అవసరం. చెప్పుకోవడానికి నిర్వాణ్ ఆత్రేయ, రాజా కుమారి, కరణ్ పాండవ్ వంటి ముగ్గురు సంగీత దర్శకులు ఉన్నప్పటికీ.. ఎందుకో సరైన మ్యూజిక్ రాబట్టుకోలేకపోయారు దర్శకురాలు నిశాంతి ఏవని.

కొన్ని సన్నివేశాల్లో సైలెన్స్ మరీ ఎక్కువగా ఉండటం వల్ల ఆడియన్స్ నిద్రపోయే స్టేజికి వెళ్లిపోయారు.అయితే దర్శకురాలు తీసుకున్న పాయింట్ మంచిదే. సంధ్య, వీరా జీవితాలతో మంచి ఫిలాసఫీ చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే మహిళల పర్సనల్ వ్యవహారాలు బయటకు వస్తే.. సొసైటీలో కొంతమంది ఎలాంటి అడ్వాంటేజీలు తీసుకోవాలని చూస్తారో చెప్పడానికి సంధ్య ఆఫీస్ సీన్ ఒక ఉదాహరణ.

అలాగే మహిళల పట్ల సొసైటీ చూపించే వివక్ష, పాతకాలపు పద్ధతులతో వాళ్ళలో పెరిగే ఇన్సెక్యూరిటీస్‌ను కూడా బాగా చూపించారు. చెప్పుకోవడానికి సినిమాలో ఇలాంటి మంచి విషయాలు ఉన్నాయి. కానీ స్క్రీన్‌ప్లే ఆసక్తికరంగా లేకపోతే.. ఎన్ని మంచి విషయాలు ఉన్నా.. ఆడియన్స్‌కి అవి కనెక్ట్ అవ్వవు. వీరా లైఫ్‌లో పడుతున్న స్ట్రగుల్‌ను చూపించిన తీరు బాగున్నప్పటికీ.. ఆ పాత్రకు ఇచ్చిన ఎండింగ్ కావచ్చు, ప్రణవ్ పాత్రతో సినిమా రంగంపై వేయాలనుకున్న సెటైర్ కావచ్చు.. ఎందుకో సరిగ్గా వర్కౌట్ కాలేదు.

విశ్లేషణ: మొత్తంగా ‘ఇంప్యూర్’ సినిమాలోని సోల్ మంచిదే. కానీ, ఇంగ్లీష్ వెర్షన్ తరహాలో తీసిన ఈ తెలుగు సినిమాలో ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లే కూడా ఉండి ఉంటే దీని స్థాయి మరోలా ఉండేది.

ఫోకస్ పాయింట్: వెబ్ సిరీస్‌కి ఎక్కువ.. సినిమాకి తక్కువ

రేటింగ్: 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus