Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

కోలీవుడ్‌లో ఫ్యాన్‌ వార్‌ అంటే ఠక్కున గుర్తొచ్చే హీరోల పేర్లు విజయ్‌, అజిత్‌. దాదాపు ఒకే స్టార్‌ ఇమేజ్‌ ఉన్న ఈ ఇద్దరు హీరోలు నిజానికి మంచి మిత్రులు. అయితే వారి ఫ్యాన్స్‌ అలా కాదు. అవకాశం దొరికినప్పుడల్లా ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటూ ఉంటారు. అయితే వారు నిజమైన ఫ్యాన్సా? లేక మన దగ్గరలాగే హీరోల ఫ్యాన్స్‌ పేరుతో ట్రోలర్లు అలా చేస్తున్నారా? అనేది తెలియదు. కానీ అజిత్‌ – విజయ్‌ మాత్రం ఎప్పటికప్పుడు తమ మధ్య ఉన్న స్నేహ బంధం గురించి చెబుతూ ఉంటారు.

Vijay and Ajith

అయితే, ఈ మాటలు పట్టించకోని ఫ్యాన్స్‌ లేనిపోని రచ్చ చేస్తుంటారు. అలాంటివారికి కళ్లు తెరిపించేలా మరో సందర్భం ఒకటి బయటకు వచ్చింది. తమిళ నిర్మాత, విజయ్‌కి స్నేహితుడు అనే పేరున్న రోమియో పిక్చర్స్‌ అధినేత రాహుల్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయ్‌ విషయంలో అజిత్‌ ఎలా ఉంటాడు అనే వివరాలను చెప్పారు. దీంతో ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

అది 2018 దివాళీ సీజన్‌. విజయ్‌ నటించిన ‘సర్కార్‌’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఆ సందర్భంలో ఓసారి అజిత్‌ను రాహుల్‌ కలిశారట. మాట్లాడుతూ మాట్లాడుతూ ‘నువ్వు విజయ్‌కి పెద్ద ఫ్యాన్ అని నాకు తెలుసు. మీ హీరో సినిమా రేపు రిలీజ్‌ అవుతోంది కదా’ అని అన్నారట. మరి సినిమాకు వెళ్తున్నావు కదా అని కూడా అన్నారట. అంతేకాదు నాకు కూడా ఓ టికెట్‌ నీతో కలసి విజయ్‌ సినిమా చూస్తాను అని అన్నారు అని రాహుల్‌ చెప్పారు.

అయితే, మరి టికెట్‌ తీశారా, ఇద్దరూ కలసి సినిమా చూశారా అనేది తెలియదు. అయితే ఇద్దరి మధ్య ఉన్న బంధం గురించి రాహుల్‌ చెప్పిన ఈ విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ మాటలు విన్నాక అయినా ఫ్యాన్స్‌ దుందుడుకు చర్యలు ఆగితే బాగుంటుందని తటస్థ అభిమానులు కోరుకుంటున్నారు.

సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus