బన్నీ-సుకుమార్ మూవీ టైటిల్ ఇంత వెరైటీగానా?

  • April 7, 2020 / 12:06 PM IST

కరోనా ఫియర్ తో లోకం వణికిపోతున్న వేళ బన్నీ ఫ్యాన్స్ కి ఆయన తీపి కబురు మోసుకొచ్చారు. ఆయన పుట్టిన రోజు కానుకగా రేపు తన కొత్త మూవీ నుండి ఓ ఆసక్తికర అప్డేట్ ఇవ్వనున్నారు. దర్శకుడు సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ తన 20వ చిత్రాన్ని చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రష్మిక మందాన మొదటిసారి బన్నీతో జత కడుతుంది. రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో బన్నీ మాస్ అండ్ డి గ్లామర్ రోల్ చేస్తున్నారు.

ఆయన ఈ చిత్రంలో లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం ఆయన భారీగా గడ్డం, జుట్టు పెంచేశారు. బన్నీ ఈ చిత్రం కోసం చిత్తూరు రాయలసీమ యాస కూడా నేర్చుకున్నాడు. ఆయన మాండలికం కూడా చాలా భిన్నంగా ఉండనుంది. ఇక రేపు బన్నీ పుట్టినరోజు కానుకగా ఇవ్వనున్న ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏమిటనే ఆసక్తి ఇప్పటికే ఫ్యాన్స్ లో మొదలైంది పోయింది. ఇప్పటివరకు ఈ మూవీ కేవలం ఒక షెడ్యూల్ పూర్తి చేసుకోగా, బన్నీ పాల్గొనలేదు.

లాక్ డౌన్ తరువాత మొదలయ్యే షెడ్యూల్ లో ఆయన పాల్గొననున్నారు. కాబట్టి ఫస్ట్ లుక్ రావడం కష్టమే. చాలా వరకు సుకుమార్ రేపు ఈ చిత్ర టైటిల్ లోగో పోస్టర్ విడుదల చేసే అవకాశం కలదు.ఇక పుష్ప అనే టైటిల్ అనుకున్నారని ఓ వార్త కూడా బయటికి వచ్చింది. అలా అని అసలు ఫస్ట్ లుక్ ఖచ్చితంగా రాదని కాదు,షూటింగ్ లో పాల్గొనక పోయినా సినిమాకు సంబంధించిన మేకోవర్ పూర్తయింది కాబట్టి, ఫస్ట్ లుక్ వదిలినా ఆశర్యం లేదు. చూద్దాం, బన్నీ ఏమి తీసుకొస్తాడో రేపు.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus