నందమూరి బాలకృష్ణ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. మొదటి షెడ్యూల్ ని విజయవంతంగా పూర్తి చేసిన పూరి నెక్స్ట్ షెడ్యూల్ వచ్చే నెల నుంచి మొదలు పెట్టనున్నారు. గౌతమి పుత్ర శాతకర్ణి తర్వాత బాలయ్య చేస్తున్న ఈ సినిమాకి టపోరి అనే టైటిల్ ఫిక్స్ చేశారని కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. చిరంజీవి పాటలోని ఆ పదంతో పేరు పెడితే అంగీకరించమని బాలయ్య ఫ్యాన్స్ ఆగ్రహించడంతో ఆ పేరుని మార్చారు. మాఫియా నేపథ్యంలో సాగే బాలకృష్ణ 101 వ ఫిలింకి ఉస్తాద్ అనే పేరుని డైరక్టర్ ఖరారు చేసినట్లు సమాచారం.
బాలయ్య పక్కన నూతన నటి ముస్కాన్ నటిస్తున్నట్లు ప్రకటించిన పూరి జగన్నాథ్, మరో హీరోయిన్ పేరుని కూడా త్వరలో వెల్లడించనున్నారు. అప్పుడే ఈ టైటిల్ కూడా రివీల్ చేసే ఆలోచనలో డైరక్టర్ ఉన్నారని తెలిసింది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 29న రిలీజ్ కానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.