ట్రైలర్ తోనే హీటెక్కించిన హేట్ స్టోరీ 4

కథ-కథనంతో సంబంధం లేకుండా కేవలం వేడెక్కించే శృంగార సన్నివేశాలతో ఇప్పటికే మూడు పార్ట్ లు సక్సెస్ అయిపోయాయి. ముఖ్యంగా రెండు-మూడు భాగాలైతే వందల కోట్లు కలెక్ట్ చేసాయి. పది సెక్స్ సీన్స్, నాలుగు హాట్ సాంగ్స్, లెక్కలేనన్ని బూతులు కలగలిపితే “హేట్ స్టోరీ”. ఈ సిరీస్ లో ఇప్పుడు నాలుగో సినిమా రెడీ అవుతోంది. ఎప్పట్లాగే విశాల్ పాండ్య దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో సరికొత్త సల్ట్రీ భామగా ఊర్వశి రొటేలా కనువిందు చేయనుంది. ఆల్రెడీ సెక్సీయస్ట్ హీరోయిన్ గా బాలీవుడ్ లో మాంచి పేరున్న ఊర్వశి ఇదివరకూ “గ్రాండ్ మస్తీ” సిరీస్ లో రూపొందిన తాజా చిత్రంలో అందాలను ఏమాత్రం మొహమాటపడకుండా ఆరబోసిన విధానం, శృంగారం అనే పదం సైతం సిగ్గుపడేలా పండించిన సెక్స్ సీన్స్ చూసి కొందరు ఇబ్బందిపడగా.. ఇంకొందరు మాత్రం సంతోషకరమైన సంతృప్తితో సతమతమయ్యారు.

అలాంటిది సెక్స్ సీన్స్ కు పెట్టింది పేరైన “హేట్ స్టోరీ” సిరీస్ లో ఊర్వశి నటిస్తుందంటే.. ఆ తరహా చిత్రాల కోసం ఎదురుచూసే ప్రేక్షకుల్లో ఆత్రం బాగా పెరిగిపోయింది. ఎక్స్ పెక్టేషన్స్ కు ఏమాత్రం తగ్గకుండా ఊర్వశి రొటేలాకు తోడుగా ఇహానా ధిల్లాన్, రీటా సిద్ధిఖీ అనే మరో ఇద్దరు హాట్ భామలను కూడా ఈ సిరీస్ కు జతపరిచిన ట్రైలర్ ను నేడు విడుదల్ చేశారు. ముద్దులు, హగ్గులు లెక్కలేనన్ని ఉండగా శృంగార సన్నివేశాలు పోర్న్ మూవీస్ ని తలపిస్తున్నాయి. ఇక ఇంతకంటే సగటు సెక్స్ సినిమా అభిమాని కోరుకొనేది ఏముంది చెప్పండి. సొ, రిజల్ట్ తో సంబంధం లేకుండా ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కలకలం సృష్టించడం ఖాయమనిపిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus