Salman Khan, Chiranjeevi: సల్మాన్ ఖాన్, మెగాస్టార్.. హై వోల్టేజ్ అప్డేట్!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో మొదటి సారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న విషయం తెలిసిందే. మలయాళం ఇండస్ట్రీలో బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన లూసిఫర్ సినిమాను తెలుగులో గాడ్ ఫాదర్ గా చేస్తున్న మెగాస్టార్ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నారట. ఇక తమిళ దర్శకుడు మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.

తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది అని దర్శకుడు చాలా ధీమా వ్యక్తం చేస్తున్నాడు.ఇప్పటికే రెండు ముఖ్యమైన షెడ్యూల్ పూర్తి చేసుకున్న గాడ్ ఫాదర్ జనవరి తుది దశలో లేదా ఫిబ్రవరి మొదట్లో మరో ముఖ్యమైన షెడ్యూల్ ను మొదలు పెట్టబోతున్న ట్లు తెలుస్తోంది. ఇక ఆ షెడ్యూల్ లో సల్మాన్ ఖాన్ కూడా పాల్గొనబోతున్నారని సమాచారం. సల్మాన్ ఖాన్ ఆ సినిమా కోసం వారం రోజుల పాటు హైదరాబాద్ లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ బాలీవుడ్ స్టార్ ప్రత్యేకంగా మెగాస్టార్ కోసమే ఆ సినిమా చేసేందుకు ఒప్పుకున్నారట. గాడ్ ఫాదర్ లో సల్మాన్ ఖాన్ చాలా పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. సినిమాలో హీరో పాత్ర అపాయంలో ఉన్న ప్రతిసారి అతను స్పెషల్ గా ఎంట్రీ ఇస్తాడు అని తెలుస్తోంది. తమిళంలో మోహన్ లాల్ హీరోగా నటించగా పృథ్వీరాజ్ ప్రత్యేకమైన పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు పృథ్వీరాజ్ తరహా పాత్రలో సల్మాన్ కనిపించబోతున్నాడు.

ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ చిరంజీవి కలయికలో వచ్చే సన్నివేశాలు కూడా ఫ్యాన్స్ విజిల్స్ వేసేలా ఉంటాయని తెలుస్తోంది. సమ్మర్ అనంతరం ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలి అని ఆలోచిస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించాడు. ఫిబ్రవరి 4వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమా కూడా వాయిదా పడే అవకాశం ఉన్నట్లుగా ఒక టాక్ వినిపిస్తోంది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Share.