కంగనాని కిడ్నాప్.. దీపికతో డేటింగ్!

  • August 3, 2016 / 12:21 PM IST

ప్రతి మనిషికి వేపకాయంత వెర్రి ఉంటుందని అంటుంటారు. అయితే.. కొందరికి ఆ పరిమాణం ఎదిగే కొద్దీ తగ్గుతుంది. కానీ.. కొంతమందికి మాత్రం అంతకంతకూ పెరుగుతుంది. బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కు ఆ వెర్రి కాస్త ఎక్కువగానే ఉన్నట్లుంది. అందుకే “మీకు ఎవర్నైనా కిడ్నాప్” చేయాలనుందా అని మీడియా వారు ప్రశ్నించగా.. టక్కున “కంగనాను కిడ్నాప్ చేయాలనుంది” అని సమాధానమిచ్చాడు. అంతటితో ఆగకుండా దీపికా పడుకొనేతో డేటింగ్ చేయాలనుందని కూడా చెప్పాడు. ఇర్ఫాన్ కోరికల చిట్టా బాగానే ఉంది కానీ.. దానికి సదరు హీరోయిన్లు ఒప్పుకొంటారో లేదో.

ఇకపోతే.. “పీకు” అనే సినిమాలో కలిసి నటించిన ఇర్ఫాన్ ఖాన్-దీపికా పడుకొనేలు మరోమారు వెండితెరను పంచుకోనున్నారని వినికిడి. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించనున్న “పద్మావతి” చిత్రంలో ఇర్ఫాన్ ఖాన్ ను ఓ కీలకపాత్ర కోసం ఎంపిక చేసుకొన్నాడట. అలాగే త్వరలోనే “లాంచ్ బాక్స్” ఫేమ్ రితేష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న తాజా చిత్రంలోనూ ఆమెతో రొమాన్స్ చేయనున్నాడు. సో ఫ్యూఛర్ హీరోయిన్స్ ఇద్దరిపై ఇర్ఫాన్ ఖాన్ కి ఉన్న ఫీలింగ్స్ ని ఇలా చెప్పుకొచ్చాడన్నమాట!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus