Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

మాస్ మహారాజ్ రవితేజ ‘ధమాకా’ తర్వాత సరైన హిట్ అందుకోలేదు. ‘రావణాసుర’ ‘టైగర్ నాగేశ్వరరావు’ ‘ఈగల్’ ‘మిస్టర్ బచ్చన్’ ‘మాస్ జాతర’ ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’ వంటి సినిమాలు అన్నీ దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. వాటి ప్రభావం రవితేజ మార్కెట్ పై గట్టిగా పడింది. ఇలాంటి టైమ్లో ‘ఇరుముడి’ సినిమా వస్తుంది. శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసినప్పుడు.. అంచనాలు పెద్దగా లేవు. కానీ ఎప్పుడైతే ఫస్ట్ లుక్ పోస్టర్, సాంగ్స్ బయటకి వచ్చాయో.. అక్కడి నుండి హైప్ బిల్డ్ అవుతూ వచ్చింది.

Irumudi

‘ఇరుముడి'(Irumudi) టైటిల్ సాంగ్, మల్లెపూల పల్లకి సాంగ్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. బిజినెస్ కూడా బాగానే జరిగింది. ఒకసారి వాటి వివరాలు అలాగే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతనేది తెలుసుకుందాం రండి :

నైజాం  5 cr
సీడెడ్  2 cr
ఆంధ్ర(టోటల్) 8 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 15 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.6 cr
ఓవర్సీస్ 2 cr
టోటల్ వరల్డ్ వైడ్ 18.6 కోట్లు

‘ఇరుముడి’ చిత్రానికి రూ.18.6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.19 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. యావరేజ్ రిపోర్ట్స్ వచ్చినా.. వీక్ డేస్ లో నిలబడితే టార్గెట్ రీచ్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఎలా చూసినా ఇది మినిమమ్ గ్యారెంటీ ప్రాజెక్ట్ అనే చెప్పాలి.

ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus