Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

అంటే అన్నాం అని బాధపడతారు.. మమ్మల్నే అన్నారు అని గింజు కుంటారు కానీ.. టాలీవుడ్‌లో సక్సెస్‌ను సెలబ్రేట్‌ చేసుకునే హీరోలు ఎంతమంది ఉన్నారు. ఇదేం ప్రశ్న సక్సెస్‌ మీట్‌లు పెట్టి బాగానే సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు కదా అంటారా? మేం అంటున్నది ఎవరి సినిమా సక్సెస్‌ వారు సెలబ్రేట్‌ చేసుకోవడం కాదు.. ఇతరుల సక్సెస్‌ను సెలబ్రేట్‌ చేసుకుంటున్నది ఎవరు అనేది మా ప్రశ్న. సెలబ్రేషన్‌ కాకపోయినా ఒక కంగ్రాట్యులేషన్స్‌ మెసేజ్‌ కూడా రావడం లేదు.

Irumudi

వరుసగా విజయాలు అందుకుంటున్న హీరోకు.. ప్రతి సినిమా సక్సెస్‌కు కంగ్రాట్స్‌ చెప్పడం బోరింగ్‌ కాబట్టి చెప్పలేదు అనుకుంటే ఓకే. కానీ సరైన విజయం రాక.. ఇక కెరీర్‌ కష్టమే అనుకుంటున్న సమయంలో బ్లాక్‌బస్టర్‌ విజయం అందుకున్న రవితేజకు.. అందులోనూ అందరివాడు అనిపించుకున్న రవితేజను అభినందించడానికి మన హీరోలకు, పరిశ్రమ పెద్దలకు మనసు రావడం లేదా? ఒకరిద్దరు హీరోలు తప్ప ఇంకెవరూ మెచ్చుకున్నది లేదు. ఒక కుటుంబానికి చెందిన హీరోలు అయితే మెచ్చేసుకున్నారు.

టాలీవుడ్ అంటే ఒక కుటుంబం, మేమంతా ఒక్కటే అని చెప్పుకునే ప్రముఖులు చాలామంది ‘ఇరుముడి’ విజయంపై స్పందించలేదు. ఒక సినిమా వస్తే నిర్మాతలందరం ఒకటైపోతున్నాం అని చెప్పిన వారు కూడా ఇప్పుడు ఒక్కటి కావడం కాదు కానీ.. ఒక్క పోస్టు కూడా సోషల్‌ మీడియాలో పెట్టడం లేదు. ఇలాంటప్పుడే పక్క పరిశ్రమలు బెటర్‌ అనే మాట అనిపిస్తూ ఉంటుంది. మొన్నటికిమొన్న ‘టాక్సిక్’ సినిమాపై విమర్శలు వస్తే శాండిల్‌ వుడ్‌ పెద్దలు యశ్‌ తరఫున మద్దతుగా మాట్లాడారు.

తెలుగు సినిమా పరిశ్రమలో ఇటీవల కాలంలో ఇలా మౌత్‌ టాక్‌తో విజయం సాధించిన సినిమా లేదు. ఆ నోళ్లన్నీ ప్రేక్షకులవే. వాటికి స్టార్‌ హీరోలు, స్టార్‌ టెక్నీషియన్ల నోళ్లు కూడా కలిస్తే సినిమాకు ఎంత మంచిది అనే విషయం పక్కన పెడతే.. పరిశ్రమకు అయితే చాలా మంచిది.

ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus