తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ జోసెఫ్ పార్టీ టీవీకే.. అతి పెద్ద (అత్యధిక స్థానాలు అందుకుని) పార్టీగా విజయం సాధించడం, ఆ తర్వాత ఆయన సీఎం అవ్వడం.. ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. పార్టీ ఏర్పాటు చేసిన సుమారు 100 రోజుల్లో ఆయన అధికారంలోకి రావడం అందరం చూశాం. అయితే దీని వెనుక ఆయన ఎన్నో ఏళ్ల శ్రమ ఉందని చెబుతారు. తన అభిమాన సంఘాల ద్వారా తమిళనాడులోని మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లి అక్కడ వారికి సాయం చేశారు. అవసరాలు తీర్చారు.
ఇప్పుడు, ఇదే ప్రయత్నంలో అల్లు అర్జున్ కూడా ఉన్నాడా? అవుననే అనిపిస్తోంది ఆయన అభిమాన సంఘాలు చేస్తున్న పనులు చూస్తుంటే. మామూలుగా ఫ్యాన్ అసోసియేషన్స్ అంటే సినిమా రిలీజ్‌లు, సెలబ్రేషన్స్, బర్త్‌డే ఈవెంట్స్ గుర్తొస్తాయి. కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటోంది. సామాజిక సేవ విషయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మంచి ఆలోచనలు చేస్తున్నారు. హెచ్‌పీవీ అవేర్‌నెస్ కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవుల్లో అల్లు అర్జున్ అభిమానులు సుమారు 800 అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. వీటి ద్వారా దాదాపు మూడు లక్షల మంది బాలికలకు దీని గురించి అవగాహన కల్పించారు. AAFA వాలంటీర్లు పాఠశాలలకు వెళ్లి అవేర్‌నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రజలకు దగ్గరవుతున్నారు.
ఇదంతా చూస్తుంటే ప్రజా సేవ విషయంలో తారక్ వదిలేసిన అవకాశాన్ని బన్నీ ఒడిసి పట్టుకున్నాడు అనిపిస్తోంది. RAWNTR అనే అభిమాన బృందం చేస్తున్న పనులను ఇటీవల ఆపేశారు. తొలుత ఊరూ వాడ అనే బృహత్తర కార్యక్రమం నిలిపేయించగా/ నిలిపివేయగా.. ఆ తర్వాత మొత్తం పనులు ఆపేశారు. ఈ లెక్కన బన్నీ కూడా తన అభిమానులతో తొలుత గ్రామాలకు, ప్రజలకు దగ్గరై ఆ తర్వాత పాలిటిక్స్‌లో రావాలని చూస్తున్నాడా? అనే చర్చ మొదలైంది.