బాలకృష్ణ – అనీల్‌ రావిపూడి మూవీపై కొత్త బజ్‌

  • April 22, 2021 / 11:03 AM IST

‘పటాస్‌’ సినిమా తర్వాత అనీల్ రావి పూడి ఒక్కసారిగా టాప్ డైరక్టర్‌ లిస్ట్‌లోకి అర్హత సాధించేశాడు. సినిమాలో చూపించిన కమర్షియల్‌ ఎలిమెంట్స్‌, కామెడీ, హీరోయిజం… ఇలా అన్నీ ప్రేక్షకుల నచ్చేశాయి. దీంతో స్టార్‌ హీరోలతో వరుస సినిమాలు కన్ఫార్మ్‌ అనుకున్నారు. అనుకున్నట్లుగానే వరుసగా సినిమాలు చేస్తూ, హిట్లు కొట్టుకుంటూ వస్తున్నాడు. ఆ క్రమంలో తొలినాళ్లలోనే నందమూరి బాలకృష్ణతో సినిమా చేసే అవకాశమూ వచ్చింది. అయితే ఏమైందో ఏమో కానీ ఆ సినిమా ఓకే కాలేదు. ఇప్పుడు మరోసారి ఇద్దరూ కలసి పని చేస్తారని వార్తలొస్తున్నాయి. అది కూడా అప్పటి కథతో.

నందమూరి బాలకృష్ణ హీరోగా ‘రామారావు గారూ’ అనే సినిమాను ప్లాన్‌ చేశాడు అనీల్‌ రావిపూడి. కథ చెప్పాడని, అంతా ఓకే అయిందని అని కూడా వార్తలొచ్చాయి. అయితే ఏమైందో సినిమా పట్టాలెక్కలేదు. తర్వాత అనీల్‌ వేరే సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. తాజాగా మరోసారి ఇద్దరి కాంబో వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణకు అనీల్ కథ చెప్పాడని, ఇప్పుడు అంతా ఓకే అయ్యిందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు చెప్పిన కథ కూడా పాతదే అని టాక్‌. ‘రామారావు గారూ’ కథను కాస్త మార్చి, బాలకృష్ణకు తగ్గట్టుగా మార్పులు చేసి వినిపించి ఓకే చేసుకున్నాడట.

ప్రస్తుతం బాలకృష్ణ ‘అఖండ’ సినిమా పనుల్లో ఉన్నాడు. ఇవి చివరి దశకు వచ్చేయడంతో తర్వాతి సినిమా వీలైనంత త్వరగా ప్రారంభించాలని చూస్తున్నాడట. మరోవైపు అనీల్ రావిపూడి ‘ఎఫ్‌ 3’ సినిమా పనుల్లో ఉన్నాడు. ఆ సినిమా అయిపోయాక బాలకృష్ణ సినిమా మీదకు వస్తాడని అంటున్నారు. అయితే ‘ఎఫ్‌ 3’ పనులు ఆలస్యమయ్యేలా ఉన్నాయి. దీంతో ఈ గ్యాప్‌లో బాలయ్య వేరే సినిమా ఏమైనా ప్లాన్‌ చేస్తాడేమో చూడాలి.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus