బాహుబలి – ఫేస్ ఒఫ్ ఇండియన్ సినిమా, తెలుగు సినిమా చరిత్రలో కానీ వినీ ఎరుగని కలెక్షన్స్ తో దుమ్ము దులిపెస్తూ దూసుకుపోతున్నాడు బాహుబలి. తెలుగు, హింది, తమిళం, మళయాళం అన్న తేడా లేకుండా ప్రతీ చోట సూపర్ హిట్ టాక్ అందుకుని వసూళ్ల పరంగా రికార్డు కలెక్షన్స్ ను అందుకోవడమే కాకుండా ఇక బాహుబలికి తిరుగులేదు అని చెబుతూనే దూసుకెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా బాహుబలికి చెక్ పెట్టే సినిమా వచ్చేసింది. అవును బాహుబలి హవాకు ఈ వారంలోనే గండి పడబోతోంది అన్న వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే, ‘బాహుబలి 2’ కలక్షన్స్ వేగానికి చెక్ పెడుతూ ప్రస్తుతం చైనాలో పరుగులు తీస్తున్న ‘దంగల్’ మూవీ నిన్నటి రోజుతో 1400 కోట్లు మార్క్ రీచ్ అయిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. మరో 100 కోట్లు కలెక్ట్ చేస్తే ‘బాహుబలి-2’ తో సమానంగా ‘దంగల్’ కూడా వరల్డ్ వైడ్ గ్రాస్ లో 1500 కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరుతుంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల బట్టి చూస్తుంటే మరో వంద కోట్ల రూపాయలు సాధించడం ‘దంగల్’ సినిమాకు కేవలం ఒకటి రెండు రోజుల పని మాత్రమే అన్న వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చైనా బాక్సాఫీస్ వద్ద ఇంకో పెద్ద సినిమా బరిలో లేకపోవడం కూడా దంగల్ కు పరిస్థుతులు అన్నీ కలిసి వస్తున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితులు చూస్తూ ఉంటే ఒక్క చైనా మార్కెట్ లోనే అమీర్ ఖాన్ “దంగల్” 1000 కోట్లు సాధిస్తుందన్న నమ్మకం బలపడుతోంది అన్న వార్తలు వస్తున్నాయి. అయితే మరో పక్క దంగల్ సినిమా అంతటి అఖండ విజయాన్ని అందుకోవడం అసాధ్యం అని ఇదంతా బాహుబలికి పోటీగా కావాలనే చేస్తున్న ప్రచారం అని సైతం వార్తలు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం మొన్నటి శనివారం వరకు ‘బాహుబలి 2’ ప్రపంచ వ్యాప్తంగా 1538 కోట్లు వసూలు చేసింది అన్న తెలుస్తుంది. అయితే ‘దంగల్’ కలక్షన్స్ వేగంతో పోల్చుకుంటే ‘బాహుబలి 2’ వేగం బాగా తగ్గింది అని సైతం ట్రేడ్ వర్గాల నుంచి వస్తున్న న్యూస్. మరి ఏది ఎంతవరకూ నిజమో తెలీదు కానీ, మొత్తంగా అయితే మాత్రం బాహుబలి2 కి ఎదురీత మొదయాలయింది అనే చెప్పాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.