ఆ “టైటిల్”కు చిరు ఒప్పుకుంటాడా??

మెగాస్టార్ చిరంజీవి అంటేనే ఒక ప్రభంజనం. అప్పట్లో ఆయన ఆడిందే ఆట, పడిందే పాట. ఇక ఆతరువాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి సినిమాలకు గుడ్ బై చెప్పేసిన విషయం తెలిసిందే. అదే క్రమంలో పాలిటిక్స్ లో పెద్దగా కలసి రాక మళ్లీ తెరపై కనిపించాలని సాగిస్తున్న ప్రయత్నాలు సైతం మనకు తెలిసినవే. ఇదిలా ఉంటే మన టాలీవుడ్ లో చాలా మంది యువ హీరోలు చిరు ఇమేజ్ ను వారికి నచ్చినట్లుగా, తోచిన విధంగా వాడేసుకుంటున్నారు. వారిలో నేనేమైనా తక్కువ అని అనుకున్నాడో ఏమో మన మెగా హీరో సాయి ధర్మ తేజ, ఆయన ఏకంగా చిరు సినిమా టైటిల్స్ పైనే కన్నేసాడు. చిరు మెగాస్టార్ కాక ముందు ఆయన్ని అభిమానులు సుప్రీమ్ అని పిలిచేవారు. ఇక ఆ టైటిల్ నే తన సినిమా టైటిల్ గా ఫిక్స్ చేసేసుకుని దూసుకుపోతున్నాడు మన సాయి. అంతటితో ఆగితే బాగానే ఉండేది. చూసి చూసి ఇప్పుడు ఏకంగా చిరు కరియర్ లోనే బ్లాక్ బష్టర్ హిట్ అయిన ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ పై కన్నేసాడు. ఆదేమైనా సామాన్యమైన సినిమానా, కలెక్షన్స్ పరంగా చిరును ఎక్కడికో తీసికెళ్లిన చిత్రం. మరి అలాంటి రేంజ్ ఉన్న చిత్రాన్ని మన యువ హీరో వాడుకోవడం ఎంతవరకూ కరెక్ట్ అనేది పక్కన పెడితే, ఈ విషయం ఇంకా చిరుకు తెలియదంటా…తెలిస్తే ఒప్పుకునే అవకాశం కూడా తక్కువ అన్న వాదన బలంగా వినిపిస్తుంది. మధ్యలో చెర్రీ వచ్చి ఆ టైటిల్ నాకు కావాలి అన్నా ఆశ్చర్య పోవాల్సిన పని లేదు. మరి మెగాస్టార్ ఏమంటాడో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus