చంద్రబాబు మంచి చేయాలనుకున్నాడు కానీ..

గత కొన్ని రోజులుగా టి.డి.పి పార్టీ “ఎన్టీఆర్ మహానాయకుడు” సినిమా ఆడుతున్న థియేటర్లు లీజ్ కి తీసుకొని.. లోకల్ జనాలతో థియేటర్లు నింపి హౌస్ ఫుల్ అని చూపించుకోవడం కోసం తాపత్రయపడుతోందని వార్తలు, కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. అలాగే.. “యాత్ర” సినిమాని కూడా కొన్ని థియేటర్లలో ఫ్రీగా షోలు వేస్తున్నారని టాక్ బాగా స్ప్రెడ్ అయ్యింది. అయితే.. ఇవన్నీ ఫ్రీ షోలు కావు అని క్లారిటీ రావడానికి కొంచెం టైమ్ పట్టింది.

యాత్ర కానీ ఎన్టీఆర్ మహానాయకుడు కానీ.. వైయస్సార్, ఎన్టీఆర్ ల జీవితాలను అద్భుతంగా ఆవిష్కరించిన చిత్రాలు. పార్టీ సభ్యులందరూ ఆ సినిమాలు చూసి వారి జీవితాలనుంచి స్పూర్తి పొందాల్సిన అవసరం చాలా ఉందనే ఉద్దేశ్యంతో ఇరు పార్టీల పెద్దలు ఆయా పార్టీల కార్యకర్తలకు సినిమాను ఫ్రీగా చూపించడం కోసం ఏరియా వైజ్ కొన్ని థియేటర్లను లీజ్ కి తీసుకున్నారు. దాంతో సదరు పార్టీ కార్యకర్తలు వస్తున్నప్పుడు హౌస్ ఫుల్ బోర్డ్ పెట్టడం జరుగుతోంది. ఈ విషయం తెలియని కొందరు సినిమాను జనాలకు ఫ్రీగా చూపిస్తున్నారు అంటూ ప్రచారం మొదలెట్టారు. అవి ఫ్రీ షోస్ ఎలా అవుతాయి అని మొట్టుకుంటున్నా కూడా ఎవరూ వినడం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus