రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో రూపొందిన పాన్ ఇండియా సినిమా ‘పెద్ది'(Peddi). నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. కొన్నాళ్లుగా పెద్ద సినిమా లేక విలవిలలాడుతున్న బాక్సాఫీస్ కి కొంత ఊరటనిచ్చింది ‘పెద్ది’. రామ్ చరణ్ నటన, జగపతి బాబు పోషించిన అప్పల సూరి పాత్ర, అలాగే క్లైమాక్స్ వంటి వాటి గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు ఆడియన్స్. సాంగ్స్ కూడా స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి.
రూ.350 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా ఇది. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయ్యింది. అన్ని భాషల్లోనూ అగ్రెసివ్ గా ప్రమోట్ చేసింది చిత్ర బృందం. అన్నిటికీ మించి సోలో రిలీజ్ దక్కించుకుంది.
దీంతో మినిమమ్ పాజిటివ్ టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టడం అనేది ‘పెద్ది’ కి కేక్ వాక్ అని అంతా అనుకున్నారు. మొదటి రోజు వసూళ్లు కూడా బాగానే నమోదయ్యాయి. ప్రీమియర్ షోలతో కలుపుకొని రూ.135 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్టు మేకర్స్ చెబుతున్నారు.
కానీ అవి ఆల్ టైమ్ రికార్డ్ ఓపెనింగ్స్ ఏమీ కాదు. అల్లు అర్జున్ ‘పుష్ప’, ఎన్టీఆర్ ‘దేవర’, ప్రభాస్ ‘కల్కి 2898 ad’ ‘సలార్’ ‘ఆదిపురుష్’, పవన్ కళ్యాణ్ ‘ఓజి’ వంటి సినిమాల ఓపెనింగ్స్ తో పోలిచినా తక్కువే. దీంతో రాబోయే రోజుల్లో ‘పెద్ది’ రూ.1000 కోట్ల మైలురాయిని చేరుకోవడం సాధ్యమేనా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి ఏమవుతుందో..!