Ramayana 2: షాకిచ్చిన ‘రామాయణ’ దర్శకుడు.. అంటే ‘దేవర’కి చేసినట్లే చేస్తారా?

‘రామాయణ’ సినిమాను అనౌన్స్‌ చేసినప్పుడు, ఆ తర్వాత షూటింగ్‌ జరుపుతున్నప్పుడు సినిమా టీమ్‌ చూపించిన కాన్ఫిడెన్స్‌, చెప్పిన మాటలు, ఇచ్చిన బజ్‌, తీసుకొచ్చిన వైబ్‌ ఓ లెవల్‌లో ఉన్నాయి. ‘రామాయణ: పార్ట్‌ 1’ రిలీజ్‌కి రెండు రోజుల ముందు వరకు ఈ మాటలు అలానే కొనసాగాయి. అయితే అనూహ్యంగా సినిమా విడుదలకు ముందు అంటే నవంబరు 4న సినిమా గురించి దర్శకుడు నమిత్‌ మల్హోత్రా షాకింగ్‌ విషయం చెప్పారు. ఆ మాట వింటే ‘సలార్‌ 2’, ‘దేవర 2’, ‘కల్కి 2’ సినిమాలు కళ్ల ముందు కదలాడాయి.

Ramayana 2

అవెందుకు అనుకుంటున్నారా? ఇంకెందుకు సినిమాకు సీక్వెల్‌ ఉంటుంది అని చెప్పి.. ఆ తర్వాత అనుకున్నట్లుగా రెండ పార్ట్‌ షూటింగ్‌ ప్రారంభించని సినిమాలు అవే కాబట్టి. అందులో ‘దేవర 2’ పరిస్థితి అయితే ఇంకా దారుణం. అసలు సినిమా ఉందో లేదో కూడా తెలియడం లేదు. ఇదిగో, అదిగో అని కొద్ది రోజులు చెప్పినా.. ఆ తర్వాత సప్పుడు లేదు. ఇక ‘సలార్‌ 2’ త్వరలో స్టార్ట్‌ అంటుంటే.. ‘కల్కి 2’ సినిమా షూటింగ్‌ చేస్తున్నాం అని చెబుతున్నారు.

అసలు ఇన్ని డౌట్స్‌ రావడానికి కారణం ఏంటా అని చూస్తే.. ‘రామాయణ పార్ట్‌ 1’ విడుదలైన ఏడాదికే పార్ట్‌ 2ను తీసుకొస్తామని గతంలో ప్రకటించిన చిత్ర బృందం. ఇప్పుడు 2027 దీపావళికి సినిమాను విడుదల చేయడం లేదని చెప్పారు. రెండో భాగాన్ని 2028లో తీసుకురావాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ‘‘రామాయణ పార్ట్‌-1’పై ప్రేక్షకులకు ఉత్సాహం, ఆసక్తిని గమనించాం. రెండో భాగాన్ని విడుదల చేసే విషయంలో మరికొంత సమయం తీసుకోవాలని నిర్ణయించాం అని చెప్పేశారు.

దీంతో ‘రామాయణ పార్ట్‌ 2’ తీస్తారా? విడుదల చేస్తారా? అనే డౌట్స్‌ మొదలయ్యాయి. అయితే సగం రామాయణం చూపిస్తే ఎవరూ ఊరుకోరు. ఆ లెక్కన కష్టమో, నష్టమో రెండో పార్టును తీయాల్సిందే, రిలీజ్‌ చేయాల్సిందే. మరి 2028లో ఎప్పుడు తెస్తారు అనేది తేలాలి అంటే.. సినిమా షూటింగ్‌ మొదలవ్వాలి.

బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus