‘మహేష్ 26’ సుకుమార్ డైరెక్షన్లో ఉంటుందని గతంలో చాలా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మిస్తుందని కూడా వార్తలు వచ్చాయి. నిర్మాతలు వారి సోషల్ మీడియా పేజీలో కూడా ‘మహేష్ 26’ ను వారే నిర్మిస్తున్నట్టు పెట్టుకున్నారు. ఇంకేముంది ఈ ప్రాజెక్ట్ ఫిక్స్ అని అందరూ అనుకున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా మహేష్ కి హ్యాండ్ ఇచ్చి అల్లు అర్జున్ తో సినిమా సెట్ చేసుకున్నాడు సుకుమార్. ఈ విషయం పై వెంటనే స్పందించిన మహేష్ కొన్ని కారణాల వల్ల సుకుమార్ తో సినిమా చేయలేకపోతున్నట్టు స్పష్టం చేసాడు.
అయితే అసలు ఇష్యూ ఇక్కడినుండే మొదలయ్యింది. ఈ విషయం పై మహేష్ హర్ట్ అయ్యాడని భావించి అల్లు అరవింద్… నమ్రతను కలిసి ఈ విషయం పై వివరణ ఇచ్చారంట. ఎవర్నీ నొప్పించకుండా ఈ ఇష్యూ ని స్మూత్ గా క్లోజ్ చేయడానికి అల్లు అరవింద్ ప్రయత్నించగా దీనికి నమ్రత కూడా సానుకూలంగా స్పందించారంట. ఇక సుకుమార్ కూడా తాజాగా మహేష్ ని కలిసారట. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటున్న ‘మహర్షి’ సెట్ కి వెళ్ళి అక్కడ మహేష్ ని కలిసి… అసలు తాను అల్లు అర్జున్ తో సినిమా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారంట. దీనిని మహేష్ కూడా అర్ధం చేసుకుని సుకుమార్ కి ‘ఆల్ ది బెస్ట్’ చెప్పారంట. ఈ విధంగా.. అటు మహేష్ ఇటు సుక్కూ… ఈ ఇష్యూ ని చాలా స్మూత్ గా క్లోజ్ చేసారన్న మాట.