Anasuya: దోషం కారణంగా సతమతమవుతున్న అనసూయ?

  • November 14, 2022 / 10:02 PM IST

తెలుగు బుల్లి తెరపై యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ గురించి అందరికీ సుపరిచితమే జబర్దస్త్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం ఈ కార్యక్రమానికి దూరమై పూర్తిగా బుల్లితెరకు దూరంగా ఉంటున్నారు. ఇలా బుల్లితెర కార్యక్రమాలకు దూరమైనటువంటి అనసూయ వెండితెరపై పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఈమె నటించిన పుష్ప సినిమా మినహా ఏ సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి.

ఇకపోతే ఈ మధ్యకాలంలో అనసూయ నటించిన సినిమాలు సక్సెస్ కాకపోవడమే కాకుండా బుల్లితెరపై కూడా అవకాశాలు లేకుండా పోయాయి అదే విధంగా సోషల్ మీడియాలో అనసూయ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఏర్పడుతుంది. సోషల్ మీడియా వేదికగా అనసూయ ఏ విధమైనటువంటి పోస్ట్ చేసిన ఆమె పట్ల తీవ్రంగా వ్యతిరేకత రావడం గమనార్హం. ముఖ్యంగా ఈమె వస్త్రధారణ గురించి ఎంతోమంది ఎన్నోసార్లు ట్రోల్ చేయగా ఈమె మాత్రం వెనకడుగు వేయకుండా

తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ తన గురించి నెగిటివ్ కామెంట్లు చేసే వారికి తనదైన స్టైల్ లో సమాధానాలు చెబుతున్నారు. ఇకపోతే ఆంటీ అనే వివాదం తీవ్రస్థాయిలో వివాదాలకు దారి తీయడంతో ఏకంగా పోలీసులను కూడా ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా అనసూయకు నేటిజెన్ల నుంచి ఈ విధమైనటువంటి వ్యతిరేకత ఏర్పడటమే కాకుండా బుల్లితెర కార్యక్రమాలు లేకుండా పోవడం సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ కాకపోవడానికి కారణం ఉందని,

 

అనసూయ జాతకంలో దోషం కారణంగానే ఇలా అన్ని తనకు వ్యతిరేకంగా జరుగుతున్నాయని వెంటనే దోష నివారణ పరిహారాలు చేస్తేనే ఈ ఇండస్ట్రీలో సక్సెస్ అందుకోగలుగుతుంది లేకపోతే తన కేరియర్ మరింత క్లిష్టంగా మారుతుందనే వార్తలు వినపడుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus