యువ ముఖ్యమంత్రి ధ్యేయమిదే!

  • March 6, 2018 / 06:51 AM IST

మహేష్ బాబు టైటిల్ పాత్ర పోషించిన “భరత్ అనే నేను” టీజర్ ఇవాళ సాయంత్రం 6.00 గంటలకి విడుదలవ్వనున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా కనిపించనున్న విషయం తెలిసిందే. రాష్ట్రాన్ని శాసించే అధికారం ఉన్న ప్రతి ముఖ్యమంత్రికి ఒక ధ్యేయం ఉంటుంది. అదే విధంగా భరత్ (మహేష్ బాబు)కు కూడా ఒక ధ్యేయం ఉంది. ఆ ధ్యేయం ఎంటనేది ఇవాళ ఉదయం విడుదల చేసిన పోస్టర్ లో చూపించారు దర్శకులు కొరటాల శివ.

మహేష్ బాబు యాపిల్ ల్యాప్ టాప్ లో “భారతదేశంలో విద్యావ్యవస్థ” అనే న్యూస్ ఆర్టికల్ చదువుతున్నట్లు ఉంది. దాన్నిబట్టి.. భరత్ ధ్యాస భవిష్యత్ తరాల చదువు గురించి అని తెలుస్తోంది. మహేష్ సరసన కైరా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 20న విడుదలకు సిద్ధమవుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus