Trivikram: ఆ దర్శకుడి తర్వాత త్రివిక్రమ్‌కే ఆ అవకాశం.. పెద్ద పదవా? చిన్న పదవా?

  • October 5, 2024 / 11:02 AM IST

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గురించి గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అక్కడ ఏం జరిగింది అనేది మామూలుగా మాట్లాడొచ్చు కానీ.. ఇప్పుడు ఆ విషయం సుప్రీం కోర్టులో ఉంది కాబట్టి.. ఇప్పుడు మాట్లాడకపోవడమే బెటర్‌. మరి ఎందుకు టీటీడీ గురించి ప్రస్తావించారు అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వేరే విషయంలో టీటీడీ ప్రస్తావన సోషల్‌ మీడియాలో కనిపిస్తోంది.

Trivikram

అదే.. టీటీడీ బోర్డులో కొత్త సభ్యుల రాకకు రంగం సిద్ధం చేస్తున్నారు అని సమాచారం. గత ప్రభుత్వాల హయాంలో జరిగినట్లే ఈసారి కూడా సినిమా రంగం నుండి ఓ దర్శకుణ్ని తీసుకుంటున్నారు అని వార్తలొస్తున్నాయి. అంతేకాదు ఆ అవకాశం జనసేనకు దక్కింది అని చెబుతున్నారు. ఆ కోటాలో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌కు దక్కుతుంది అని లెక్కేస్తున్నారు. ఇటీవల ఆయన వరుసగా తిరుమలలో కనిపించడానికి అదే కారణం అని అంటున్నారు.

పవన్ కల్యాణ్‌ తన ప్రాయశ్చిత్త దీక్ష విరమణ కోసం నేడు తిరుపతి వెళ్లినపుడు కూడా త్రివిక్రమ్‌ కూడా వెళ్లారు. ఇదంతా టీటీడీ బోర్డులో ఆయన ప్రవేశానికే అని చెబుతున్నారు. పవన్‌ కల్యాణ్‌కు ఇటు సినిమాల విషయంలోనూ, ఇటు రాజకీయాల విషయంలో త్రివిక్రమ్‌ బాగా నమ్మకస్తులు. అందుకే ఆయనకు జనసేన తరఫున టీటీడీ బోర్డులోకి వస్తారు అని చెబుతున్నారు.

టాలీవుడ్‌ నుండి ప్రస్తుతం సీనియర్‌ నిర్మాత అశ్వనీదత్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, సీనియర్‌ నటుడు మురళీ మోహన్‌ లాంటివాళ్లు టీటీడీ బోర్డు మెంబర్‌ అవ్వాలని అనుకుంటున్నారు. కుదిరితే టీటీడీ బోర్డు ఛైర్మన్‌ కూడా అవ్వాలని ఈ ముగ్గురు అనుకుంటున్నారు అని టాక్‌. కాబట్టి త్రివిక్రమ్‌కు ఆ పెద్ద పదవి రాదు కానీ.. బోర్డు మెంబరు అయితే అవుతారు అనే మాట వినిపిస్తోంది.

పవన్‌ అసలు పేరు మనం అనుకుంటున్నది కాదు.. ఇంకొకటి ఉంది తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus