దసరా బరి నుండి ‘ఇజం’ అవుట్..?

  • September 17, 2016 / 07:40 AM IST

ఈ ఏడాది దసరా పండగల సినిమాల్లో పెద్ద హీరోల సినిమాలేవీ లేవు. అయితే సినిమాల లెక్క ఎక్కువయ్యేసరికి ఓపెనింగ్స్ కలెక్షన్ల రూపేణా పరిశ్రమకి, పండగ సెలవులకి సరిపడా ప్రేక్షకులకి మంచే జరుగుతుందని ఇరు వర్గాలు సరిపెట్టుకున్నాయి. అయితే ఒక్కొక్కటిగా ఈ లిస్ట్ నుండి జారిపోవడంతో ఈ సీజన్ లో అంత సందడి కానరాదని అనిపిస్తోంది.రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తోన్న ‘ధృవ’ దసరా సీజన్ కి వస్తుందని అనుకున్నారు.

అయితే ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు. దీంతో ధృవ డిసెంబర్ కి వాయిదా పడిందని పరిశ్రమ వర్గాల భోగట్టా. పోతే.. పూరితో సినిమా అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చిన కళ్యాణ్ రామ్ తన మేకోవర్, టీజర్ రూపేణా ప్రేక్షకులలో ఆసక్తి రేపాడు. దాంతో దసరా కళ్యాణ్ రామ్ కి నిర్మాతగానూ మేలు చేస్తుందని అనుకుంటే.. ఈ సీజన్ నుండి కళ్యాణ్ రామ్ తప్పుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. దీనికి కారణం రీషూట్లే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై పూరి అండ్ కో సమాధానమేమిటో..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus