‘ఇస్మార్ట్ శంకర్’… అప్పుడే బ్రేక్ ఈవెన్ అయిపొయింది

  • July 22, 2019 / 01:18 PM IST

ప్లాపుల్లో ఉన్న ఓ డాషింగ్ డైరెక్టర్ కి ఎనర్జిటిక్ హీరో దొరికితే ఏ రేంజ్ హిట్టు కొట్టగలడో.. అనేది పూరి జగన్నాథ్ మరోసారి ప్రూవ్ చేశాడు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో ఆయన తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం జూలై 18 న విడుదలైంది. గత కొంత కాలంగా సరైన హిట్టు లేక సో.. సో సినిమాలతో లాగించేస్తున్న రామ్,పూరి లు… ఈ చిత్రంతో మంచి మాస్ హిట్టుని అందుకున్నారు. మొదటి షో నుండే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి. రామ్ కెరీర్లో ఇవి బిగ్గెస్ట్ ఓపెనింగ్స్. అంతేకాదు వీకెండ్ పూర్తయ్యేసరికి బ్రేక్ ఈవెన్ సాధించి సూపర్ హిట్ లిస్ట్ లో చేరిపోయింది ‘ఇస్మార్ట్ శంకర్’. తెలంగాణ యాసతో.. రామ్ ను ఊర మాస్ గా చూపించాడు పూరి. దీంతో మాస్ సెంటర్స్ లో ఈ చిత్రం ఇరక్కొట్టేస్తుంది. ఇక ‘ఇస్మార్ట్ శంకర్’ ఫస్ట్ వీకెండ్ ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 8.82 కోట్లు
సీడెడ్ – 3.30 కోట్లు
వైజాగ్ – 2.33 కోట్లు


ఈస్ట్ – 1.36 కోట్లు
కృష్ణా – 1.33 కోట్లు
గుంటూరు – 1.36 కోట్లు


వెస్ట్ – 1.06 కోట్లు
నెల్లూరు – 0.72 కోట్లు
—————————————————–
ఏపీ + తెలంగాణ – 20.28 కోట్లు


రెస్ట్ అఫ్ ఇండియా – 1.25 కోట్లు
ఓవర్సీస్ – 0.80 కోట్లు
—————————————————–
వరల్డ్ వైడ్ టోటల్ – 22.33 కోట్లు (షేర్)
——————————————————

‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ 17 కోట్లు జరిగింది. మొదటి నాలుగు రోజులకే ఈ చిత్రం 22.33 కోట్ల షేర్ ను రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా సూపర్ హిట్ లిస్ట్ లో చేరిపోయింది. మాస్ సినిమా రేంజ్ ఏంటనేది ఈ చిత్రం మరోసారి ప్రూవ్ చేసింది. ఓవర్సీస్ లో ఈ చిత్రాన్ని 90 లక్షలకు అమ్మగా ఇప్పటి వరకూ 80 లక్షలు రాబట్టింది. మరి పది లక్షలు ఈజీ గానే వచ్చేస్తాయనడంలో సందేహం లేదు. వీక్ డేస్ లో కూడా ఈ చిత్రం కలెక్షన్లు స్టడీగా ఉంటే.. బ్లాక్ బస్టర్ లిస్ట్ లో కూడా చేరడం గ్యారంటీ..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus