షాకిస్తున్న ‘ఇస్మార్ట్ శంకర్’ ప్రీ రిలీజ్ బిజినెస్ ..!

  • April 30, 2019 / 05:59 PM IST

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్‌ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జ‌గ‌న్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఇస్మార్ట్ శంక‌ర్’. ‘డ‌బుల్ దిమాక్ హైద‌రాబాది’ అనేది ట్యాగ్ లైన్‌. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రం కోసం రామ్ న్యూ లుక్ ట్రై చేస్తున్నాడు. ఎప్పుడూ లేని విధంగా ఎంతో కష్టపడి ఈ చిత్రం కోసం 6 ప్యాక్ బాడీని కూడా డెవలప్ చేసాడు. ఈ చిత్రంలో రామ్ నటన కచ్చితంగా ఆకట్టుకునే విధంగా ఉంటుందని సమాచారం. ఇక ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి 70 శాతం షూటింగ్ పూర్తయ్యిందని సమాచారం. ఇక ఈ చిత్ర షూటింగ్లో భాగంగా భారీ యాక్ష‌న్ ఎపిసోడ్ చిత్రీక‌ర‌ణ రేప‌టి నుండి వారణాసిలో చిత్రీక‌రించ‌నున్నారు.

ఈ యాక్ష‌న్ పార్ట్ సినిమాలో చాలా కీలకమట. దీంతో డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ భారీ రేంజ్‌లో ఈ సీక్వెన్స్‌ని తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే హైద‌రాబాద్ నుండీ సినిమాకు సంబంధించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు వార‌ణాసి బయల్దేరారు. పూరి స్ట‌యిల్లో రియ‌ల్ స‌తీష్ ఈ యాక్ష‌న్ పార్ట్‌ను తెర‌కెక్కించ‌బోతున్నాడట. హీరో రామ్‌, నిధి అగ‌ర్వాల్‌తో ఆశిష్ విద్యార్థి, షాయాజీ షిండే, దీప‌క్ శెట్టి, తుల‌సి త‌దిత‌రులు ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారని సమాచారం. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతుందట. పూరికి ‘టెంపర్’ తర్వాత ఒక్క హిట్టు కూడా లేదు.. ఇక రామ్ కి కూడా సో సో చిత్రాలే ఉన్నాయి. అయినప్పటికీ ఈ చిత్రానికి 25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుగుతుందట. రామ్ గత చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’ చిత్రం 21 కోట్ల వసూళ్ళను రాబట్టింది. ఆ నమ్మకంతోనే ఈ చిత్రానికి భారీ రేటు పలుకుతున్నట్టు స్పష్టమవుతుంది. ఇక డిజిటల్ రైట్స్ అన్నీ కలుపుకుంటే 30 కోట్లు పైనే ఈ చిత్రానికి బిజినెస్ జరుగుతుందని స్పష్టమవుతుంది. మరి ఈ చిత్రం రిలీజయ్యాక ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus