ఇక్కడ అమ్మాయిలకు ఈజీగా మనీ రాదు

  • September 22, 2016 / 09:36 AM IST

“అమ్మాయిలకు సినీ రంగానికి మించిన సేఫ్ ప్లేస్ ఇంకోటి లేదు” అని అనుష్క చెప్పారు. యోగా ట్రైనర్ స్వీటీ సూపర్ సినిమా ద్వారా అడుగు పెట్టి టాప్ హీరోయిన్ గా ఎదిగారు. ప్రస్తుతం దక్షిణాది సినీ పరిశ్రమల్లో అనుష్క చిత్రాలను చేస్తూ బిజీ గా ఉన్నారు. రీసెంట్ గా ఆమె ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ “సినీ పరిశ్రమ అంత సేఫ్ కాదు.. అనే మాటల్లో వాస్తవం లేదు. ఇదే సేఫ్ ప్లేస్. ఇక్కడ మనం ఏమి చేస్తున్నా అందరి కళ్లు మన మీద ఉంటాయి. సో తప్పు చేయడానికి ఆస్కారం ఉండదు” అని వివరించారు.

కొత్తగా ఈ ఫీల్డ్ లోకి వస్తున్న తారల గురించి చెబుతూ “కొంతమంది ఈజీ మనీ వస్తుందని, చాలా వేగంగా పేరు వస్తుందని భావించి ఇక్కడకు వస్తుంటారు. అదంతా సింపుల్ కాదు. పని చేయాలి. ఎంత కష్టపడితే అంత పేరు వస్తుంది. లేదంటే వెంటనే బయటికి వెళ్లిపోవాల్సిందే” అని వివరించారు. “ఇక్కడ హీరోయిన్లకు చాయిస్ ఉంటుంది. మంచి ఎంచుకోవచ్చు, చెడు ఎంచుకోవచ్చు. వారి నిర్ణయం బట్టే కెరీర్ లైఫ్ ఆధారపడి ఉంటుంది.” అని అనుష్క స్పష్టం చేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus