‘గీత గోవిందం’ సినిమా సమయంలో ఓ పాట పాడినందుకు.. విజయ్ దేవరకొండ పై ఓ రేంజ్లో ట్రోలింగ్ జరిగింది. రక రకాల మీమ్స్ తో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసారు. అయితే విజయ్ దానిని పెద్దగా లెక్కచేయలేదు. ‘గీత గోవిందం’ ప్రీ రిలీజ్ వేడుకలో ఆ మీమ్స్ అన్నిటిని స్క్రీన్ పైన వేయించుకుని మరింత ప్రమోషన్ చేసుకున్నాడు. ఎవరో తనని ట్రోల్ చేసేదేముంది.. తన మీద తనే డైలాగులు వేసుకుంటూ ప్రేక్షకుల్ని బాగా ఎంటర్టైన్ చేస్తుంటాడు ఈ రౌడీ బాబు. ఇప్పుడు మరోసారి విజయదేవరకొండ పై ట్రోలింగ్ జరుగుతుంది.
విషయం ఏమిటంటే.. విజయ్ దేవరకొండ.. పుట్టిన రోజు మే 9. కాబట్టి హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు వంటి నగరాల్లో ఐస్ క్రీమ్ లను ఫ్రీగా పంచే కార్యక్రమం ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో.. ‘చిన్నప్పుడు నా పుట్టినరోజున స్కూల్ లో పిల్లలందరికీ చాక్లెట్స్ పంచుతుంటే చాలా హ్యాపీగా ఉండేదని చెప్పాడు. ఇక్కడే పాపం మన హీరో సోషల్ మీడియా జనాలకు దొరికిపోయాడు. మే నెలలో పిల్లలకు సెలవులు ఉంటాయి. ఏ స్కూల్ కూడా ఆ నెలలో రన్ చేయరు. విజయ్ చదివిన పుట్టపర్తిలో.. కూడా సెలవులిస్తారు. విజయ్ మాత్రం స్కూలూ, చాక్లెట్లు అనేసరికి అడ్డంగా దొరికిపోయాడు. ఛాన్స్ వస్తే ట్రోల్ చేయడానికి రెడీగా ఉండే నెటిజన్లు.. ఇప్పుడు దీనిపై మీమ్స్ తయారు చేసి దేవరకొండని కామెడీ చేస్తున్నారు. అయితే ఏంటి.. ఈ మీమ్స్ ను కూడా ‘డియర్ కామ్రేడ్’ వాడేస్కుంటాడు అనికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు ఈ టాపిక్ వైరల్ గా మారింది.