రీల్ లైఫ్ లో ఒకే కానీ.. రియల్ లైఫ్ లో కష్టమే

  • December 30, 2017 / 12:52 PM IST

‘పరిణీతి’ లాంటి అద్భుతమైన చిత్రంలో తన నటచాతుర్యంతో ఆకట్టుకొన్నప్పటికీ.. ‘డర్టీ పిక్చర్’లో ఆరబోసిన అందాలు, పండించిన శృంగార రసం వల్లే ఆడియన్స్ కి ఎక్కువగా గుర్తుండిపోయింది విద్యాబాలన్. బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అయిన సిద్ధార్థ్ రాయ్ కపూర్ ను వివాహమాడి సినిమాకి కాస్త గ్యాప్ ఇచ్చి.. ప్రస్తుతం సెలెక్టడ్ గా సినిమాలు చేసుకొంటూ వస్తున్న విద్యాబాలన్ ను ఇటీవల కొందరు మీడియా మిత్రులు “మరి పిల్లలు ఎప్పుడు?” అని అడగగా.. “ప్రస్తుతానికి పిల్లలు కనేందుకు తనకు సమయం లేదు” అని చాలా సింపుల్ గా సమాధానమిచ్చింది.

ప్రస్తుతం తను సమయాన్నంతా సినిమాలకే కేటాయిస్తున్నాను, పెళ్లైంది కదా అని చెప్పి పిల్లలను కనడానికి తనకు సమయంల లేదని అంటోంది విద్యాబాలన్. ప్రస్తుతం బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అన్నట్టుగా తన కెరీర్ ను సాగిస్తోంది విద్య. హీరోలకు ధీటైన ఇమేజ్ తో ఈమె స్టార్ డమ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇలాగే మరిన్ని సినిమాలు చేయాలని విద్య అనుకుంటోందట. విశేషం ఏమిటంటే.. జనవరి ఒకటో తేదీన విద్యాబాలన్ పుట్టిన రోజు. మరో రెండు రోజుల్లో విద్య 39 యేళ్ల వయసును పూర్తి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో పిల్లల ప్రస్తావన తెస్తే విద్య పై విధంగా స్పందించింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus