పింకీ కి అప్పుడే పెళ్ళైపోయిందా.. షాక్ లో ఆడియన్స్..!

‘జబర్దస్త్’… ఈ కామెడీ షో గురించి ప్రత్యేక పరిచయం లేదు. ఈ షో టీఆర్‌పీ రేటింగ్‌ విషయంలో టాప్ రేంజ్లో ఉంది. ఇక ఈ షో లో పాల్గొంటున్న నటులు, యాంకర్లు, జడ్జ్ ల రేంజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. ఈ షోలోని నటులు మంచి పాపులర్ అవ్వడంతో వారికి సినిమాలో అవకాశాలు కూడా ఓ రేంజ్లో వస్తున్నాయి అనడంలో సందేహం లేదు. అయితే వీరిపైన రూమర్స్ కూడా అదే రేంజ్లో వస్తుంటాయి. ఇది కాసేపు పక్కన పెట్టి విషయానికొద్దాం… ఇటీవల ‘జబర్దస్త్’ కమెడియన్ సాయితేజ అలియాస్ పింకీకి సీక్రెట్ గా పెళ్ళైందని తెగ ప్రచారం జరుగుతుంది.

‘జబర్దస్త్‌’ లో లేడీ గెటప్స్‌ వేస్తూ పాపులారిటీ సంపాదించుకున్న సాయి తేజ .. ఆ తర్వాత ‘జెండర్ ట్రాన్స్‌ప్లాంటేషన్’ సర్జరీ చేయించుకొని నిజంగానే అమ్మాయిగా మారిపోయాడు. సాయి తేజ గా ఉన్న తన పేరును కూడా ప్రియాంక సింగ్‌గా మార్చుకున్నాడు. అయితే ప్రస్తుతం కొంచెం ఆరోగ్యం బాగోకపోవడంతో ‘జబర్దస్త్’ కు దూరంగా ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నాడు. ‘టిక్ టాక్‌’ లో మాత్రం పింకీ పేరుతో వీడియోలు చేసి ప్రేక్షకులతో టచ్ లో ఉంటూ వస్తున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో పోస్ట్ చేసిన కొన్ని వీడియోలలో ప్రియాంక సింగ్ మెడలో పసుపు తాడు ఉండడం, చేతులకు కూడా గోరింటాకు పెట్టుకోవడం చూసి.. సీక్రెట్ గా పెళ్ళి కూడా చేసేసుకున్నాడు అంటూ అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇక అదే నిజమని కూడా అంతా ఫిక్స్ అయిపోయారు. దీంతో… ‘నాకు పెళ్ళై పోయిందని జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజంలేదు.. విజయవాడ కనకదుర్గ ఆలయానికి వెళ్ళినప్పుడు పూజారి ఇచ్చిన పసుపు తాడును ధరించాను.. అంతేతప్ప అది మంగళసూత్రం కాదు. నేను పెళ్ళి చేసుకుంటే అందరికీ చెప్పే చేసుకుంటాను” అంటూ ఈ విషయం పై క్లారిటీ ఇచ్చాడు.

తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus