క్లాసిక్ సాంగ్ ను సెక్స్ సాంగ్ చేసేశారు కదరా.!

  • March 23, 2018 / 07:02 AM IST

తెలుగులో మంచి విజయం సాధించిన “క్షణం”కి రీమేక్ గా బాలీవుడ్ లో రూపొందుతున్న “భాగి 2” చిత్రంలో మాధురీ దీక్షిత్ నృత్యం చేయగా 1988లో వచ్చిన సూపర్ హిట్ సాంగ్ “ఏక్ దో తీన్”ను కూడా రీమిక్స్ చేసిన విషయం తెలిసిందే. జాక్వాలిన్ ఫెర్నాండెజ్ ఈ రీమిక్స్ సాంగ్ లో నర్తించింది. అయితే.. ఇటీవల ఒరిజినల్ వెర్షన్ దర్శకుడు, కొరియోగ్రాఫర్ ఈ రీమిక్స్ సాంగ్ ను చూశారట. మాధురీ దీక్షిత్ ఎంతో హుందాగా అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా సదరు సాంగ్ లో డ్యాన్స్ చేస్తే.. జాక్వాలిన్ చేసిన డ్యాన్స్ ఏదో సెక్స్ యాక్ట్ లా ఉంది అని వారు పేర్కొనడం విశేషం.

పాట గౌరవాన్ని పోగొట్టడంతోపాటు ఎంటర్ టైన్మెంట్ పేరుతో ఇలాంటి బీగ్రేడ్ సాంగ్ ను చిత్రీకరించినందుకు చిత్రబృందంపై లీగల్ కేస్ వేయాలనుకొంటున్నారట. అదే సందర్భంలో ఈ పాటలో ఇంత జుగుప్సాకరంగా నర్తించినందుకు జాక్వలిన్ కు కూడా నోటీసులు పంపాలని ప్లాన్ చేస్తున్నారట దర్శకనిర్మాతలు. పాపం ఏదో ఒక రెండు మూడు కోట్ల కోసం కక్కుర్తిపడి.. కష్టపడి కురుచ బట్టలతో వందల మంది నడుమ సిగ్గులేకుండా డ్యాన్స్ చేస్తే ఈ అనవసరమైన రచ్చ ఏమిటా అని జాక్వలిన్ బాధపడుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus