జగపతి బాబు(Jagapathi Babu) ముక్కుసూటి మనిషి. ఏ విషయమైనా ఓపెన్ గా మాట్లాడతారు. వాళ్లేమనుకుంటారు.. వీళ్ళేమనుకుంటారు అనే ఆలోచనలు ఆయన పెట్టుకోరు. ఈయన జెన్యూనిటీ కారణంగానే జెంజీస్ కి కూడా దగ్గరవ్వగలిగారు అని చెప్పాలి.
త్వరలో రిలీజ్ కాబోయే ‘పెద్ది’ సినిమాలో అప్పల సూరి అనే అత్యంత ముఖ్యమైన పాత్రని పోషించారు జగపతి బాబు. ఆయన లుక్, డైలాగ్ డెలివరీ చాలా కొత్తగా ఉన్నాయి. ట్రైలర్ చూస్తే కనుక.. ‘పెద్ది’ కథ చాలా వరకు ఈయన పాత్ర చుట్టూనే తిరుగుతుంది అనిపిస్తుంది.
‘పెద్ది’ ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన విలేకరి సమావేశంలో జగపతి బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని సాధారణ విషయాలకి సంబంధించిన ప్రశ్నలకి ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. బూమ్రా విషయంలో చరణ్ పై జరిగిన ట్రోలింగ్ ను జగపతి బాబు ఖండించారు. ‘పనీపాటా లేనివాళ్లు… చరణ్ లాంటి కష్టపడే వాళ్ళని ఏ విషయంలో పట్టుకుందామా, ఎక్కడ దొరుకుతారా అని ఎదురుచూస్తారు’ అంటూ ఆయన శైలిలో స్పందించారు.
అలాగే తాను నటించిన ప్రతి సినిమా ప్రమోషన్లకి రాకుండా.. కొన్ని సినిమాల ప్రమోషన్స్ కి మాత్రమే రావడంపై కూడా జగపతి బాబు స్పందించారు. ‘పెద్ది’ లాంటి పెద్ద సినిమాల ప్రమోషన్స్ కి తానవసరం లేదని, ఒకవేళ వచ్చినా చరణ్,జాన్వీ కపూర్ వంటి స్టార్స్ పక్కన తాను కనిపించనని ఓపెన్ గా చెప్పుకొచ్చారు. అందుకే ప్రమోషన్స్ కి తాను దూరంగా ఉంటానని.. కాకపోతే సెకండ్ ఇన్నింగ్స్ లో తాను నటించిన సినిమాల్లో ‘పెద్ది’ నెంబర్ వన్ ప్లేస్లో నిలుస్తుందని కూడా ధీమా వ్యక్తం చేశారు జగపతి బాబు.