జైలవకుశ ‘టీజర్’కి ముహూర్తం ఫిక్స్!

  • June 4, 2017 / 10:25 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్…ఈ పేరు వింటేనే రికార్డుల పరంపర గుర్తుకు వస్తుంది. అప్పట్లో వరుస పరాజయాలతో ఇబ్బంది పడ్డ ఎన్టీఆర్ టెంపర్ సినిమాతో ట్ర్యాక్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అదే క్రమంలో వరుసగా నాన్నకు ప్రేమతో, మరియు జనతా గ్యారేజ్ రెండు భారీ హిట్స్ అందుకుని టాలీవుడ్ రికార్డుల దుమ్ము దులిపేసాడు. ఇదిలా ఉంటే ఆ రెండు సినిమాల తరువాత చాలా గ్యాప్ తీసుకుని ఒక డిఫ్ఫ్రెంట్ కధతో, సరికొత్త పాత్రలో, త్రిపాత్రాభినయమ్ చేస్తున్న సినిమా “జైలవకుశ”. ఈ సినిమా ఫర్స్ట్ లుక్ ఇప్పటికే యూ ట్యూబ్ లో హల్‌చల్ చేసి, వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

అదే క్రమంలో విలన్ పాత్రలో ఎన్టీఆర్ ఎలా ఉండబోతున్నాడు అన్న ఆసక్తితో ఉన్నారు మన తెలుగు ప్రేక్షక అభిమానులు. అయితే అదే క్రమంలో ఎన్టీఆర్ సరికొత్త పాత్రలో నటించి మెప్పించనున్న జైలవకుశ థీం ను టీజర్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఎన్టీఆర్ అండ్ టీమ్. ఇదిలా ఉంటే ఈ టీజర్ ఎప్పుడు వస్తుంది? ఎలా ఉంటుంది అన్న ఆసక్తి అందరిలో నెలకొన్న క్రమంలో టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న కధనం ప్రకారం ఈ టీజర్ ను రంజాన్ పర్వదినాన, పండగ కానుకగా విడుదల్ చెయ్యనున్నట్లు సమాచారం. ఇదే నిజం అయితే రంజాన్ పండగ నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండగే అని చెప్పాలి. మరి టీజర్ ఎలా ఉండబోతుందో, ఎన్టీఆర్ ఎలా కనిపించనున్నాడో అన్నా ఆసక్తిని కాస్త ఆపి, రంజాన్ వరకూ వెయిట్ చెయ్యండి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus