ప్రీ రిలీజ్ బిజినెస్ లో దూసుకెళ్తున్న జై లవ కుశ!

  • July 24, 2017 / 03:01 PM IST

టాలీవుడ్ టాప్ హీరోల్లో…ఇండస్ట్రీని శాసించే వారిలో…దాదాపుగా ఎన్టీఆర్, మరియు ప్రిన్స్ లాడి ఒకటే రేంజ్…అయితే టాలీవుడ్ లో టాప్ 1 స్థానం ఎవరిది అన్న మాట పక్కన పెడితే…ఈ ఇద్దరు హీరోలు తమ రేంజ్ కి తగ్గ హిట్స్ తో దూసుకుపోతున్నారు. అయితే ఇదిలా ఉంటే ఇప్పుడు రాబోతున్న దసరా విషయంలో ఈ ఇద్దరు హీరోల మధ్య గట్టి పోటీ నెలకొంది అన్ని ఇప్పటికీ బలంగా ఉంది…ఇక టాలీవుడ్ సర్కిల్స్ లో ఈ న్యూస్ హల్‌చల్ చేస్తూ ఉంది…అయితే ఇదిలా ఉంటే అసలు మ్యాటర్ లోకి వెళితే…తాజాగా వస్తున్న వార్తల ప్రకారం….దసరా రేస్ రిజల్ట్ ఇంకా రాకుండానే జూనియర్ ‘జై లవ కుశ’ మహేష్ ‘స్పైడర్’ పై అన్ని విధాలా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అదెలాగా ఏంటి అంటే…వాస్తవానికి దక్షిణ భారత సినిమా రంగంలో టాప్ డైరెక్టర్ గా పేరు గాంచిన మురగదాస్ ప్రిన్స్ మహేష్ బాబుతో తీస్తున్న సినిమా కాబట్టి ‘స్పైడర్’ కు ఊహించని స్థాయిలో బిజినెస్ జరుగుతుందని ఈ సినిమా నిర్మాతలు ఆశించారు అని టాక్.

అయితే వీరి అంచనాలకు భిన్నంగా ‘స్పైడర్’ కంటే ఈ దసరా రేసుకు రాబోతున్న ‘జై లవ కుశ’ కు ఊహించన స్థాయికన్నా ఎక్కువ స్థాయిలో బిజినెస్ జరుగుతోందని టాలీవుడ్ బిజినెస్ వర్గాలు అంటున్నాయి. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో తీసిన ‘స్పైడర్’ కు కనీసం 150 కోట్ల బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుంది అని ఆశించారు. కానీ బిజినెస్ ఆ రేంజ్ లో ‘స్పైడర్’ కు జరగడం లేదు అని టాక్. దీనికి కారణం ‘స్పైడర్ టీజర్ కన్నా ‘జై లవ కుశ’ టీజర్ కు స్పందన విపరీతంగా రావడమే కాకుండా మాస్ ప్రేక్షకులకు ‘స్పైడర్’ కన్నా ‘జై లవ కుశ’ బాగా కనెక్ట్ అవుతుందని బయ్యర్లు భావిస్తున్నట్లు టాక్. అయితే అదే క్రమంలో….మరో పక్క వరుసగా హిట్స్ తో ఎన్టీఆర్ మంచి ఒప్పు మీద ఉంటే….‘బ్రహ్మోత్సవం’ ఫెయిల్యూర్ తరువాత వస్తున్న  ‘స్పైడర్’ కు నెగిటివ్ సెంటిమెంట్లు కూడ వెంటాడుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే….టెక్నికల్ గా వస్తున్న స్పైడర్ కి..మాస్ మసాలా గా వస్తున్న జైలవకుశ కి మంచి పోటీ తప్పదు…చూద్దాం మరి ఏం జరగబోతుందో.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus