బాబీ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న జై లవ కుశ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో 55 కోట్ల బడ్జెట్ తో కల్యాణ రామ్ నిర్మిస్తున్న ఈ మూవీలో తారక్ మూడు పాత్రల్లో నటిస్తున్నారు. మొదటి షెడ్యూల్ ని ఎన్టీఆర్ లేకుండా పూర్తి చేసిన బాబీ, రెండో షెడ్యూల్ ని ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా నెల రోజుల పాటు చిత్రీకరించారు. లవ కుమార్ పాత్రపై రామోజీ ఫిలిం సిటీలో కొన్ని సీన్స్ షూట్ చేసిన ఆయన మొన్న చిలుకూరు బాలాజీ టెంపుల్ వద్ద పెళ్లి వేడుకను తెరకెక్కించారు. దీంతో రెండవ షెడ్యూల్ పూర్తి అయింది. ఎండలు ఎక్కువగా ఉండడంతో వారం రోజుల పాటు ఎన్టీఆర్ షూటింగ్ కి గ్యాప్ ఇచ్చారు.
చిత్ర బృందం నెల రోజుల పాటు కష్టపడడంతో ఈ సెలవులను ఎంజాయ్ చేయనున్నారు. వచ్చేనెల 6వ తేదీ నుంచి తదుపరి షెడ్యూల్ ను మొదలుపెట్టనున్నారు. బాలీవుడ్ కెమెరా మెన్ సీ కే మురళీధరన్, హాలీవుడ్ లెగసీ ఎఫెక్ట్స్ టెక్నీషియన్ వాన్సీ హార్ట్ వెల్ వంటి ప్రముఖ టెక్నీషియన్లు పని చేస్తుంన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 1న రిలీజ్ చేయనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.