బాబీ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న జై లవ కుశ సినిమా మూడో షెడ్యూల్ మొదలయింది. మొదటి షెడ్యూల్ ని ఎన్టీఆర్ లేకుండా పూర్తి చేసిన డైరక్టర్, రెండో షెడ్యూల్లో లవ కుమార్ పాత్రపై ఉన్న సీన్స్ పూర్తి చేసారు. గతనెల 27 న రెండో షెడ్యూల్ కి పేకప్ చెప్పిన బాబీ వారం రోజులు విశ్రాంతి ఇచ్చారు. మళ్ళీ ఈ రోజు నుంచి షూటింగ్ ప్రారంభించారు. గుజరాత్ లోని ఓ అందమైన లొకేషన్లో వేసిన సెట్ లో పాట చిత్రీకరణ షురూ చేశారు. ఎన్టీఆర్, రాశీ ఖన్నాలపై తెరకెక్కిస్తున్న ఈ పాటను మరో నాలుగురోజులపాటు చిత్రీకరించనున్నారు. అనంతరం కూడా కొన్ని కీలక సీన్లకు గుజరాత్ లోనే షూట్ చేయనున్నట్లు సమాచారం.
ఈ షెడ్యూల్ నెలాఖరు వరకు సాగనుందని తెలిసింది. రాశిఖన్నాతో పాటు నివేదా థామస్, నందిత రాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో హంస నందిని గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వనుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో 55 కోట్ల బడ్జెట్ తో కల్యాణ రామ్ నిర్మిస్తున్న ఈ మూవీని సెప్టెంబర్ 1 న రిలీజ్ చేయాలనీ ఎన్టీఆర్ భావిస్తున్నారు. అందుకే భగభగ మండే ఎండలోనూ షూటింగ్ ఆపడం లేదు. తారక్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.