మోటివేటర్ గా నవ్వించిన జల్సారాయుడు

  • December 22, 2017 / 02:10 PM IST

ప్రపంచ శాంతి దూత కె ఏ పాల్ మాటలు కొంత ఆసక్తిగాను.. మరికొంత ఆశ్చర్యంగానూ ఉంటాయి. కొన్ని సార్లు నమ్మలేనట్టుగా అంటాయి. అతన్ని ఇమిటేట్ చేయడానికి జల్సారాయుడు సిద్ధమయ్యారు. ఎవరు ఊహించని విధంగా బీటెక్ బ్లాక్ లాగ్స్ మోటివేటర్ గా కేఏ పాల్ చేస్తే… ఎలా ఉంటుందో నటించి చూపించారు. ఈ పాత్రలో జేడీవీ ప్రసాద్ చక్కగా నటించారు. తనదైన మాటల గారడితో హాస్య సవ్వడి సృష్టించారు. అలాగే అతని అభిమానులుగా నటించిన వారు కూడా నవ్వులు పూయించారు.

“బీటెక్ బ్లాక్ లాగ్స్ మోటివేటర్” గా రిలీజ్ అయిన ఈ వీడియో హాస్య ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. బీటెక్ స్టూడెంట్స్ ఎక్కువయింది ఈ వీడియోకి కనెక్ట్ కావడం విశేషం. “పవన్ కళ్యాణ్ యాడ్స్ లో యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందో” అనే మొదటి వీడియోతో నవ్వించిన జల్సా రాయుడు రెండో ప్రయత్నంలోనూ విజయం సాధించారు. మీరు ఇంకా చూడలేదా? అయితే.. కింది లింక్ ని క్లిక్ చేసి సరదాగా నవ్వుకోండి.

https://www.youtube.com/watch?v=WvlWjeTi-HU

Click Here To Watch The Video

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus