సంక్రాంతికి రావాల్సిన సినిమా ఇప్పుడు విడుదలకు రెడీ అవుతోంది. ఈ నెలాఖరున సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఈ రెండు మాటలు చాలు ఆ సినిమా ఏంటో చెప్పడానికి. అవును ‘జన నాయగన్’ (Jana Nayagan) గురించే ఇదంతా. ఇప్పుడు సినిమా నిడివితోపాటు, సెన్సార్ కట్‌ల విషయాల గురించి చెప్పబోతున్నాం. విజయ్, పూజా హెగ్డే, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను హెచ్.వినోద్ తెరకెక్కించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించింది.
ఇక సెన్సార్ సంగతులకు వస్తే.. ఈ సినిమా నిడివి 183.11 సెకన్లు. అంటే మూడు గంటలపై మాటే. ఈ రోజుల్లో ఇంత ఎక్కువ నిడివి అంటే ఆలోచించాల్సిన విషయమే. అయితే విజయ్ ఆఖరి సినిమా, లీకులు, సెన్సార్ సమస్యలు, రాజకీయ అంశాలు కలిపి థియేటర్లో ప్రేక్షకుణ్ని అంత సేపు కూర్చోబెడతాయి అంటున్నారు. ఇక సెన్సార్ టీమ్ తొలగించమన్న, మార్పు చేయమన్న విషయాల గురించి చూస్తే..
* సినిమాలో ఓ పుస్తకం మీద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫొటో కనిపిస్తుంది. దాన్ని మార్పు చేయాలి.
* ‘అంబేద్కర్ చట్టం.. టీవీకే చట్టం’ అంటూ ఉన్న ఓ లెంగ్తీ డైలాగ్‌ని మార్చాలి.
* సినిమాలో వాడిన టీవీకే అనే పదాన్ని పూర్తిగా తొలగించాలి.
* మన దేశ జెండా నేల మీద పడిపోతున్న సన్నివేశం.
* వివిధ సందర్భాల్లో వినిపించిన భాగవతం, రంగనాథర్, తేవిద్య పయ్య, ఒతత్త, సిలువైయిల పదాలను మ్యూట్ చేయాలి.
* ఆపరేషన్ మెలూహ గురించి వివరించేటప్పుడు వచ్చే న్యూ ఇండియా పదాన్ని తొలగించాలి.
* వివిధ సందర్భాల్లో వినిపించే ఓమ్ శబ్దాన్ని తొలగించాలి.
* సద్దాం హ్యాంగింగ్ సమయంలో వినిపించే ‘తూకుల తుడికియార్త.. అవనే మిడియాల లీక్ పన్ని’ డైలాగ్‌ను తొలగించాలి లేదంటే మ్యూట్ చేయాలి.
* ఓ సన్నివేశాంలో డీసీ ఆఫీసు బ్యాడ్/సిగిల్ కిందపడే సన్నివేశాన్ని మార్చాలి లేదంటే తీసేయాలి.
* ఇండియా ఎన్ కల్ల విల వైకారెన్.. అదనే డైలాగ్‌ను మ్యూట్ చేయాలి.
* రెండు సందర్భాల్లో కనిపించే చిన్నారి కాలిపోవయే సన్నివేశాన్ని తీసేయాలి లేదంటే మార్చాలి.
* మూడు సార్లు వినిపించే షీలా రాణి పేరు బదులు వేరే పేరు పెట్టాలి.