‘వంగవీటి’లో జనసేన హంగామా!!!

  • December 5, 2016 / 10:05 AM IST

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ నా సినిమాలు నచ్చితే చూడండి, లేదంటే మానెయ్యండి అన్న కోణంలో సినిమాలు తీసే ఏకైక వ్యక్తి, దర్శకుడు, నిర్మాత మన రామ్ గోపాల్ వర్మ. అయితే….తన డైరెక్షన్, టేకింగ్ పై తనకు ఉన్న కాన్ఫిడెన్స్ ఆయన సినిమాలపై ప్రేక్షకులకు ఇంకా ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇదిలా ఉంటే నిన్న జరిగిన వర్మ డ్రీం ప్రాజెక్ట్ ‘వంగవీటి’ చాలా ప్రశాంతంగా ముగిసింది. నిన్న మార్నింగ్ నుంచి జరిగిన నాటకీయ పరిణామాల దృష్ట్యా ఈ ప్రోగ్రామ్ ఎలా అవుతుందో అని అందరూ టెన్షన్ పడ్డారు.

అయితే ఎక్కడా ఏ గొడవా లేకుండా ఈ ఫంక్షన్ ముగియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే ఇక్కడే…ఈ ఫంక్షన్ లోనే ఒక సరికొత్త విషయం చోటు చేసుకుంది…ఈ ఆడియో ఫంక్షన్ లో జనసేన జెండాలు కనిపించాయి….ఆ జెండాలతో కొందరు అభిమానులు అక్కడ హంగామా చేశారు…అయితే ఇదంతా చూస్తుంటే ఈ సినిమాకు జనసేన పార్టీ అండ ఉంది అని అనుకునేరు…కాదండోయ్…సహజంగానే మన రాష్ట్ర రాజకీయాల్లో కులం అన్న పదం చాలా  బలం అయింది. అయితే పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిన సమయం నుంచి ఆయన వర్గం ఆయన వెంటే నడుస్తుంది అన్న టాక్ సైతం బలంగా వినిపిస్తుంది. ఇక వంగవీటి కుటుంబం, పవన్ ఇద్దరూ ఒకే వర్గానికి చెందిన వారు కావడం, అందులోనూ బెజవాడలో ఆ వర్గం లెక్కల్లో కాస్త బలంగా ఉండడం, అన్నీ వెరసి వర్మ సినిమా ఫంక్షన్ కి కళ వచ్చింది….

అదే క్రమంలో ఈసినిమా ధియేట్రికల్ ట్రైలర్ ఎలా ఉంటుంది అన్న ఆశతో ఎదురు చూసిన అభిమానులకు కాస్త నిరాశే మిగిలింది…వర్మ ఇప్పటి వరకు తీసిన మాఫియా సినిమాల ట్రైలర్స్ లాగే వంగవీటి ట్రైలర్ ఉంది కాని ఇందులో ఎటువంటి ప్రత్యేకత లేదు అన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి…మరి ఆడియోకే ఇంత జరిగితే….రేపు సినిమా విడుదల తర్వాత పరిస్థితి ఏంటో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus