జనతా గ్యారేజ్ స్పెషల్ ఇన్విటేషన్!!!

  • August 9, 2016 / 01:25 PM IST

టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం జనతా గ్యారేజ్. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒక పక్క వరుస హిట్స్ తో దూసుకుపోతున్న దర్శకుడు శివ, మరోపక్క హ్యాట్రిక్ హిట్ కోసం ఎదురు చూస్తున్న యంగ్ టైగర్. అయితే ఇప్పటికే దాదాపుగా ఈ సినిమా బిజినే 70కోట్లకు పైన పూర్తి చేసుకుని ప్రభంజనాన్ని సృష్టించింది.

ఇదిలా ఉంటే వచ్చే శుక్రవారం అంటే కృష్ణ పుష్కరాలు మొదలయ్యే రోజు, అటు వరలక్ష్మి వ్రతం అన్నీ వెరసి ఎన్టీఆర్ తన జనతా ఆడియోను ప్రేక్షకులకు అందించేందుకు సిద్దం అవుతున్నాడు. అదే క్రమంలో ఈ సినిమా ఆడియో సరికొత్తగా ఉండేందుకు కావాల్సిన పద్దతులు అన్నీ పాటిస్తున్నాడు మన ఎన్టీఆర్…అందులో భాగంగానే…ఈ ఫంక్షన్ కు సంబంధించి డిఫరెంట్ స్టైల్ లో ఆడియో ఫంక్షన్ ఆహ్వాన పత్రికలను చాల వెరైటీగా ప్రింట్ చేసారు. ‘జనతా గ్యారేజ్’ టైటిల్ కు తగ్గట్టు ఒక కార్ల మెకానిక్ షెడ్డును తలపించేలా ఆహ్వాన పత్రికలను డిజైన్ చేసారు అని తెలుస్తోంది.

రెండురకాలుగా ఇన్విటేషన్ కార్డులు ప్రింట్ చేయించడమే కాకుండా జూనియర్ తన అభిమానులకు పంపేందుకు ఒక ఇన్విటేషన్ కార్డు మరియు సినిమా ఇండస్ట్రీ సెలెబ్రెటీలను పిలిచేందుకు రిమ్ టైపులో డిఫరెంట్ కార్డులను డిజైన్ చేయించినట్లు టాక్. ఇక ఇప్పటికీ ఫ్యాన్స్ అందరికీ ఇన్విటేషన్స్ అందడంతో ఆనందంలో మునిగి తేలుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇప్పటికే ఈ సినిమా టీజర్ యూ ట్యూబ్ లో దుమ్ము దులుపుతున్న క్రమంలో ఈ సినిమా ట్రైలర్ ఇంకెన్ని రికార్డులు సొంతం చేసుకుంటుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus