లీకైన జనతా గ్యారేజ్ సాంగ్ నెట్ లో హల్ చల్..!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని చేస్తున్న యాక్షన్ చిత్రం ”జనతా గ్యారేజ్”. హ్యాట్రిక్ అందుకునే దిశగా కొరటాల శివ ఈ సినిమాను అన్ని హంగులతో తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ మూవీకి లీకుల బెడద ఆగడం లేదు. కొన్ని రోజుల క్రితం చిత్రంలోని హిట్ డైలాగులు ఇవే అంటూ కొన్ని లైన్లు చక్కర్లు కొట్టాయి. అది నిజమో కాదుగాని ఇప్పుడు లీకైన పాట మాత్రం జనతా గ్యారేజ్ సినిమాకు చెందిందే. ఎందుకంటే ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అతను స్వరంతో ఉన్నఎనర్జిటిక్ సాంగ్ తారక్ కి తగినట్లుగా ఉంది.

“దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ
నిను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ
నువు పుట్టక ముందీ లోకం చీకటి
నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటీ”

అనే పల్లవితో సాగిన ఈ పాట ఎన్టీఆర్ అభిమానులకు తెగ నచ్చేసింది. “నీ అందం మొత్తం.. ఓ కుప్పగా పోస్తే ఆకాశం, నీ సొగసుని మొత్తం.. ఓ బంతిగా చేస్తే భూగోళం” అనే చరణం వింటుంటే సమంతతో కలిసి డ్యూయట్ సాంగ్ గా అనిపిస్తోంది. వాస్తవానికి జనతా గ్యారేజ్ ఆడియో రిలీజ్ వేడుకను ఈ నెల 22 న నిర్వహించాలని అనుకున్నారు. పోస్ట్ పోన్ కావడంతో అభిమానులు కొంత నిరాశ చెందారు. కానీ లీకైన పాటను వింటూ ఆనందిస్తున్నారు. సెప్టెంబర్ 2 న రిలీజ్ కానున్న ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని చెబుతున్నారు.


Janatha Garage Leaked Song Going Viral On Internet by dubsmashtelugu-official

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus