జనతా గ్యారేజ్ పాటలు ఇవే..!!

  • August 9, 2016 / 07:52 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం “జనతా గ్యారేజ్” పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. వారి అంచనాలకు మించి సినిమా ఉండాలని హిట్ డైరక్టర్ కొరటాల శివ కష్టపడుతున్నారు. ఆయన శ్రమ మూవీ ఫస్ట్ లుక్, టీజర్ లో కనిపిస్తోంది. ఇవి విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఆడియో ఎలా ఉండబోతుందోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. తారక్ స్పీడ్ కి తగినట్లే రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించి ఉంటారని భావిస్తున్నారు. ఎన్టీఆర్ గత చిత్రం నాన్నకు ప్రేమతో కు క్లాస్ పాటలతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మాస్ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న జనతా గ్యారేజ్ పాటలు హుషారైన గీతాలను అందించనున్నారు. శిల్పకళా వేదికలో ఈ నెల 12 న రిలీజ్ కానున్న పాటల జాబితా ఇప్పుడే అందుబాటులోకి వచ్చాయి. వాటి వివరాలు..

01. కలయా నిజమా..
గానం : యాసిన్ నిజార్, సుచిత్ర
రచన : రామ జోగయ్య శాస్త్రి

02. ఇది ప్రేమ ఓ..
గానం : యాసిన్ నిజార్, శ్రేయ ఘోషల్
రచన : రామ జోగయ్య శాస్త్రి

03. స్పీడ్ గేర్
గానం: సాగర్, చిన్మయి
రచన : అనంత శ్రీరామ్

04. స్వీటీ ఆపిల్
గానం : గీతా మాధురి, సూరత్ సంతోష్
రచన : అనంత శ్రీరామ్

05. మేరీ జాన్
గానం : సింహ, ప్రియా హిమేష్
రచన : రామ జోగయ్య శాస్త్రి

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రత్యేక పాత్ర పోషిస్తోన్న ఈ చిత్రంలో సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్ ఓ పాటలో తారక్ తో ఆడి పాడనుంది. మైత్రి మూవీ మేకర్స్ వారు 50 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 2 న తెలుగు, తమిళ్, మలయాళ భాషలో విడుదల కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus