ఎన్టీఆర్ దూకుడుని ఆపేదెవడు???

ఒకపక్క యంగ్ టైగర్ ఎన్టీఆర్ టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాలతో వరుస హిట్స్ లో ఉండగా, మరో పక్క దర్శకుడు కొరటాల శివ సైతం మిర్చి, శ్రీమంతుడు సినిమాతో వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యంగ్ టైగర్ “జనతా గ్యారేజ్” సినిమాపై షూటింగ్ మొదటి రోజు నుంచి అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అదే క్రమంలో ఈ సినిమాలో ఎన్టీఆర్ ఫర్స్ట్ లుక్ ఎంతటి సంచలనాలను క్రియేట్ చేసిందో అందరూ మరచిపోయేలోపే, ఈ సినిమా టీజర్ విడుదలయ్యి, రికార్డ్స్ ను క్రియేట్ చెయ్యడమే కాకుండా ,కేవలం టీజర్ రిలీజ్ అయిన 6 గంటల్లోనే 1 మిలియన్ వ్యూయర్ కౌంట్ ను దాటేసి ఎన్టీఆర్ లోని కసిని, ఫైర్ ని మరోసారి చూపించింది.

అదే క్రమంలో ఎన్టీఆర్ కు మరోసారి ఇండస్ట్రీ హిట్ అందించాలి అన్న తపనతో ఉన్న యంగ్ టైగర్ అభిమానులకు ఈ సినిమా మంచి అవకాశంగా మారబోతుంది. ఒక పక్క కొరటాల దర్శకత్వం, మరోపక్క నటనకు కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన ఎన్టీఆర్ ఇక వీళ్ళిద్దరి ఔట్ పుట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా అంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు. ఇక ఈ టీజర్ లో ఎన్టీఆర్ డైలాగ్ అయితే పీక్స్, డైలాగ్ డెలివరీ, లుక్ మొత్తం చాలా ఫ్రెష్ గా కొత్తదనంతో ఉంది.

ఇక మరో పక్కతనలోని ఫైర్ ను మరింత కసిగా చూపించిన తారక్ చూస్తుంటే ఈ సినిమా తెలుగు సినిమా బాక్సాఫీస్ ను తప్పకుండా షేక్ చేస్తుంది అని చెబుతూనే…నాన్నకు ప్రేమతోతో జస్ట్ 50 కోట్లు టచ్ చేసిన జూనియర్ ఈ గ్యారేజ్ తో అంతకు డబుల్ అంటే 100 కోట్లు కొల్లగొట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఏది ఏమైనా..ఎన్టీఆర్- కొరటాల కు హ్యాట్రిక్ తప్పక వరిస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus