శ్రీదేవి చీరలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిన జాన్వి

  • May 3, 2018 / 02:26 PM IST

అతిలోక సుందరి శ్రీదేవి భౌతికంగా మనల్ని వదిలి వెళ్లినా.. ఆమె సినిమాలతో జీవించే ఉన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు మాత్రం జ్ఞాపకాల రూపంలో బతికే ఉన్నారు. శ్రీదేవి చివరి చిత్రం “మామ్‌”లో ఆమె నటన అపూర్వం. అందుకు గాను జాతీయ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. నిన్న ఈ అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో వైభవంగా జరిగింది. పలు అవార్డులను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అందజేయగా మరికొన్ని కేంద్రమంత్రులు రాజ్యవర్ధన్‌ రాథోడ్‌, స్మ్రతి ఇరానీలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా శ్రీదేవి తరఫున అవార్డు అందుకునేందుకు ఆమె భర్త బోనీ కపూర్‌, కుమార్తెలు జాన్వి, ఖుషి కపూర్లు వచ్చారు.

అయితే కార్యక్రమానికి ఖుషి లంగావోణీ ధరించగా.. పెద్ద కుమార్తె జాన్వి మాత్రం తన తల్లి చీరలో వచ్చి సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. అందరూ జాన్వి గురించి మాట్లాడుకున్నారు. ప్రస్తుతం జాన్వి మరాఠీలో సూపర్ హిట్ సాధించిన సైరత్ మూవీకి రీమేక్ అయిన ధడక్ లో నటిస్తోంది. శశాంక్ ఖైతాన్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇషాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జులై లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాతో జాన్వి తల్లికి తగ్గ తనయగా నిరూపించుకోనుంది. ఆమెను తెలుగులోనూ పరిచయం చేయడానికి టాలీవుడ్ దర్శకనిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇక్కడ ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus