మెలమెల్లగా హీటు పెంచుతున్న జూనియర్ అతిలోక సుందరి

అతిలోకసుందరి శ్రీదేవి నట వారసురాలిగా ఆమె పెద్ద కుమార్తె జాన్వీ కపూర్‌ ఇటీవల “ధడక్‌” చిత్రంతో కథానాయికగా విమర్శకులను, విశ్లేషకులను, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా.. తల్లి శ్రీదేవి వలె జాన్వీ కూడా కళ్లతోనే హావభావాలను పలికించగలదంటూ శ్రీదేవి అభిమానులతోపాటు ప్రేక్షకులు కూడా కితాబివ్వడంతో ఆమె కుటుంబ సభ్యులందరూ ఆనందంతో తబ్బిబ్బయ్యారు. శ్రీదేవి నటవారసత్వాన్ని కొనసాగిస్తూ ఆమె కూడా మంచి ప్రొజెక్ట్స్ నే ఎన్నుకుంటూ వెళ్తోంది.

janhvi-kapoor-new-look1

అయితే.. ఉన్నట్లుంది జాన్వీకి ఏమైందో తెలియదు కానీ.. ఒక్కసారిగా గ్లామర్ డోస్ ను కాస్త గట్టిగా పెంచింది. ఒక సరికొత్త ఫోటోషూట్ కోసం జాన్వీ కపూర్ తీయించుకున్న స్టిల్స్ ప్రస్తుతం వైరల్ అయ్యాయి. యద లోతులు కనబడేలా అమ్మడు వేసుకున్న దుస్తులు చూసి యువత వెర్రెత్తిపోతున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు క్రేజీ ప్రొజెక్ట్స్ ఉన్నాయి. అయితే ఆ రెండూ ప్రయోగాత్మక చిత్రాలే. ఈ ఫోటోషూట్ తో తాను కమర్షియల్ సినిమాలకు కూడా సిద్ధమేనని ఇండైరెక్ట్ సిగ్నల్స్ ఇస్తోంది జాన్వీ. మరి ఆమె ఇచ్చిన సిగ్నల్ ను ఎవరైనా అర్ధం చేసుకొంటారో లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus