నటి జయసుధ భర్త నితిన్ కపూర్ ఆత్మహత్య!

  • March 14, 2017 / 03:30 PM IST

ప్రముఖ సినీనటి జయసుధ భర్త నితిన్ కపూర్ (58) అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందారు. కాగా ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటన ముంబైలోని ఆయన స్వంత కార్యాలయంలో చోటుచేసుకుంది. నితిన్ మరణానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందిన వెంటనే జయసుధ కుటుంబం ముంబై బయలుదేరింది. అనుమానాస్పద మృతి కావడంతో ముంబై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది. కాగా,

నితిన్ కపుర్ పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. జేయస్కే కంబైన్స్ బ్యానర్‌పై పలు చిత్రాలు తీశారు. ఆశాజ్యోతి అనే సినిమాకు అసిస్టెంట్ డైరక్టర్‌గా కూడా వ్యవహరించారు. జయసుధ, నితిన్ దంపతులకు 1985లో వివాహం జరిగింది. వీరిది ప్రేమ వివాహం. వీరికి నీహార్, శ్రేయాన్ అనే ఇద్దరు కుమారులున్నారు. వీరిలో శ్రేయాన్ కొద్దిరోజుల క్రితం హీరోగా పరిచయమయ్యాడు. బాలీవుడ్ ప్రముఖ నటుడు జితేంద్ర, నితిన్ స్వంత అన్నదమ్ములు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus