“పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడు కాదు …..జనులా పుత్రుని కనుగొని పొగడంగ నాడు కలుగును సుమతీ” అనే పద్యంలోని పరమార్ధాన్ని ప్రతిఒక్కరూ ఏదో ఒక దశలో ఆస్వాదిస్తూనే ఉంటారు. కానీ.. తాను కన్న కోటి కలలు ఫలించి వెండితెరపై ప్రభలే తరుణానికి ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయిన శ్రీదేవి ఆశయాన్ని ఆమె కుమార్తె నిజం చేసి చూపించింది. పాపం ఆ విజయాన్ని చూసి ఆనందించడానికి శ్రీదేవి ఈ భూమిపై లేదనే బాధ మినహాయిస్తే.. “ధడక్” బృందం సినిమా సక్సెస్ ను పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేస్తున్నారు.
ఆ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ పూర్తి చేసుకొనేలోపే జాన్వికపూర్ కోసం మరో బాలీవుడ్ ఆఫర్ వెతుక్కుంటూ వచ్చింది. 2008లో ప్రియాంక చోప్ర, జాన్ అబ్రహం, అభిషేక్ బచ్చన్ లు నటించిన ‘దోస్తాన’ చిత్రానికి సీక్వెల్ గా రూపొందనున్న తాజా చిత్రంలో కరణ్ జోహాన్ జాన్వి కపూర్ ను కథానాయికగా ఎంపిక చేశాడట. హీరోలు ఇంకా ఫిక్స్ అవ్వని ఈ చిత్రంలో ఫిక్స్ అయిన మొట్టమొదట క్యాస్ట్ అయిన హీరోయిన్ జాన్వి కపూర్. తల్లి శ్రీదేవి దీవెనలు, నిర్మాత కరణ్ జోహార్ సపోర్ట్ తో త్వరితకాలంలోనే బడా హీరోయిన్ గా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.