అందాలతో హీట్ పుట్టిస్తోన్న జాన్వీ!

  • July 26, 2018 / 10:14 AM IST

అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి రోజురోజుకి అభిమానులను పెంచుకుంటోంది. సినిమాల్లో ఎంట్రీకి ముందే మిలియన్ల ఫాలోవర్స్ ని సంపాదించుకున్న ఈ బ్యూటీ “దఢక్”తో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాలో అందం, అభినయం, డ్యాన్సులతో యువతకి మరింత దగ్గరయింది. స్టార్ హీరోలకు సమానంగా ఈ మూవీ కలక్షన్స్ సాధిస్తోంది. దీంతో శ్రీదేవి కూతురా? మజాకా? అంటూ అభినందనలు కురిపిస్తున్నారు. అలా విజయాన్ని అందుకుందో లేదో.. ఆఫర్లు వరుసకట్టాయి. సినిమా ఆఫర్లు పక్కన పెడితే ప్రముఖ మ్యాగజైన్స్ వారు “దఢక్” తమ కెమెరాలతో బంధించడానికి పోటీ పడుతున్నాయి.

రీసెంట్ గా తన కోస్టార్ ఇషాన్ తో కలిసి ఫిల్మ్ ఫేర్ లేటెస్ట్ ఎడిషన్ కవర్ పేజీ కోసం జాన్వీ ఫోటోలకు ఫోజులిచ్చింది. అది మామూలుగా లేదు.. ఆమె అందాలు చూసి కెమెరా కన్ను కొట్టడమే మరిచిపోయేలా ఉంది. అంతలా హాట్ గా కనిపిస్తోంది. ఆ కవర్ పేజీకి సంబందించిన ఫోటోలు తాజాగా బయటికి వచ్చాయి. వీటని చూసి కుర్రకారు మతులు పోగొట్టుకుంటున్నారు. తమ మొబైల్ స్క్రీన్ సేవర్ పైన గత అభిమాన హీరోయిన్ ఫోటోని డిలీట్ చేసి జాన్వీ ఫోటోని సేవ్ చేసుకుంటున్నారు. సినిమానే లోకంగా పెరిగిన జాన్వీ.. ఎక్కడలా ఒదిగి ఉండాలో.. ఎక్కడ అందాలు ఆరబోయాలో బాగా తెలిసినట్టుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus