రోజు రోజుకి పెరుగుతున్న ఎన్టీఆర్ ఫాలోయింగ్..!

  • April 23, 2019 / 05:52 PM IST

ఎంత స్టార్ హీరో అయినా.. తన సినిమాకి సంబందించిన అప్డేట్స్ ను తమ అభిమానులతో పంచుకోవాలి అంతే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాల్సిందే. ఇందులో సెలెబ్రిటీలు ఎక్కువగా ఉపయోగించేది ట్విట్టర్. తమ సినిమా షూటింగ్ పిక్స్, అప్డేట్స్, ఫ్యామిలీ ఫోటోలు ఇలా ఏదైనా ఎక్కువగా ట్విట్టర్లో నే పోస్ట్ చేస్తుంటారు అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం మన టాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఇప్పుడు సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గానే ఉంటున్నారు.

ఇక అసలు విషయమేమిటంటే.. ఎన్టీఆర్ కు సోషల్ మీడియాలో రోజు రోజుకూ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోతొంది. ఇందుకు అసలు నిదర్శనం.. ఆయన ట్విట్టర్ ఎకౌంటే. ట్వీటర్ లో తారక్ ను ఫాలో అయ్యేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతూ ప్రస్తుతం మూడు మిలియన్లకు చేరుకుంది. ఇక మిగిలిన స్టార్ హీరోలు మూడు మిలియన్ల మార్క్ ను ఎప్పుడో చేరుకున్నారు. ఇదివరకు పెద్దగా తారక్ ట్విట్టర్ ను ఉపయోగించేవాడు. కానీ ఇప్పుడున్న కుర్ర హీరోలతో పోటీ పడాలంటే.. అప్పుడప్పుడు వారి అభిమానులని పలకరించాల్సి ఉంది. త్వరలో తారక్ ‘ఆర్.ఆర్.ఆర్’ బాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వాలి కాబట్టి.. ట్విట్టర్ లో మరింత యాక్టివ్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus