మళ్ళీ అభిమానులని ఖుషీ చేస్తున్న మహేష్,ఎన్టీఆర్..!

  • April 9, 2019 / 02:58 PM IST

‘మేము… మేము… బానే ఉంటాం… మీరే బాగుండాలి… ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను’… ఇది ‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహేష్ బాబు అభిమానులకు చెప్పిన మాటలివి. ఈ వేడుకకి ఎన్టీఆర్ ప్రత్యేక అతిధిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. అంతే కాదు సమయం దొరికినప్పుడల్లా… చరణ్,,మహేష్, రాంచరణ్ తరచూ కలుస్తూ ఉంటున్నారు. వీటికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కూడా. ఈ ఫోటోలను చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతూ కామెంట్లు కూడా పెడుతున్నారు కూడా. ఇది ఇండస్ట్రీలో మంచి పరిణామమే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్.. అటు రాంచరణ్ తో ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి భారీ మల్టీ స్టారర్ లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇక తాజాగా మహేష్ ఫ్యామిలీ… ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఏప్రిల్ 8 న (నిన్న రాత్రి) టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తన భార్య మాలిని పుట్టిన రోజుకి ఈ ఇద్దరి హీరోలను ఆహ్వానించాడు. వంశీ పైడిపల్లి గతంలో ఎన్టీఆర్ తో ‘బృందావనం’ అనే హిట్ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇక మహేష్ తో ప్రస్తుతం ‘మహర్షి’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఎన్టీఆర్, మహేష్ ఇద్దరూ తమ కుటుంబాలతో వచ్చి ఈ పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్నారు. మహేష్ భార్య నమ్రత ఈ ఫొటోని తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి అభిమానులకు ఆనందం కలుగచేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus